రాజ్యాంగ రూపకర్త.. మన అంబేద్కర్..!

Publish Date:Apr 14, 2025

Advertisement

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.. లేదా అంబేద్కర్.. భారత రాజ్యాంగ రూపకర్తగా అందరికీ ఈయన సురపరిచితం. అంతేనా..  అట్టడుగు వర్గంలో జన్మించి  పేద ప్రజలకు,  అంటరానివారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్..  చాలామంది అంబేద్కర్ కేవలం  అట్టడుగు వర్గాల వారి కోసం మాత్రమే పారాడాడని చెబుతారు. కానీ అది తప్పు.. ఆయన భారతీయుల కోసం ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం అణిచివేయబడుతున్న అన్ని రకాల వర్గాల కోసం కృషి చేశారు. అణగారిన వర్గాల న్యాయం,  సమానత్వం, గౌరవం కోసం పోరాటం చేశారు. సామాజిక వివక్షను నిర్మూలించి, తద్వారా చట్టం దృష్టిలో భారతదేశ పౌరులందరికీ సమానత్వాన్ని సమర్థిస్తూ డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని గడిపినందున ఆయన జన్మదినోత్సవాన్ని సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే..

 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో మహర్ కులానికి చెందిన వ్యక్తిగా జన్మించారు మరియు జీవితాంతం తీవ్రమైన కుల వివక్షను అనుభవించారు. అంబేద్కర్ విద్యను సాధికారత,  సామాజిక పురోగతికి ఒక మార్గంగా భావించారు,  అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేయడానికి 1923లో 'బహిష్కృత హితకారిణి సభ'ను స్థాపించారు.

అంబేద్కర్ చేసిన కృషి..

షెడ్యూల్ కులాలు,  షెడ్యూల్ తెగలకు నాటి కాలంలో చదువుకోవడం కష్టంగా ఉండేది.  తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేది.  సమాజంలో వారికంటూ ఎలాంటి గౌరవం ఉండేది కాదు.  అలాంటి వారి కోసం అంబేద్కర్ కృషి చేసారు. వీరిని (SC, St) అనే వర్గంలో చేర్చారు.

కేవలం SC, ST లు మాత్రమే కాకుండా వెనుకబడిన ఇతర తరగతుల వారిని కూడా అంబేద్కర్ పరిగణలోకి తీసుకున్నారు. ఈ OBC వర్గం వారికి కూడా రిజర్వేషన్లు కల్పించారు.

మహిళలు పురుషులతో సమానంగా ఎదగడానికి,  మహిళల సాధికారత కోసం అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు.  

కార్మికులకు, కార్మికుల కుటుంబాల విషయంలో కూడా అంబేద్కర్ ఆలోచనలు సాగాయి. కార్మిక హక్కుల కోసం,  వారి అవసరాల గురించి చర్యలు సాగాయి.

పేదవారు,  సామాజికంగా వెనుకబడినవారు మొదలైన వారికి కులంతో సంబంధం లేకుండా విద్య,  ఉద్యోగం, రాజకీయాలు, సమాజంలో కూడా ఎవరు ఎటువంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమాన హక్కులు ఉన్న దేశమే ఆయన కల.  ఆయన జీవితం కూడా ఈ హక్కుల సాదన దిశగానే సాగింది.  ఆయన జీవితం మొత్తం న్యాయం కోసం,  హక్కుల కోసం పోరాడటంలో గడిచిపోయింది.

దేశ నిర్మాణం గురించి అంబేద్కర్ కు ఒక కల ఉండేది అదే కుల నిర్మూలన.. దేశాన్ని కుల విభజన ద్వారా కాకుండా సమానత్వం ద్వారా నిర్మించాలని అంబేద్కర్ కలలు కన్నాడు. దేశ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి,  పూజ్యునీయుడు.


                                      *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.