పిల్లల ముందు ఏడుస్తుంటారా? ఈ నిజం తెలిస్తే..!
Publish Date:Sep 29, 2025
Advertisement
ఎమోషన్ సెన్సిటివిటీ.. పిల్లల ముందు ఏడుపు అనేది ఒక సహజ భావోద్వేగం, ఇది పిల్లలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి సహాయపడుతుంది. పిల్లల ముందు ఏడ్వడం లేదా బాధపడటం అనేది పిల్లలు విచారం, ఆందోళన లేదా ఒత్తిడిని దాచాల్సిన అవసరం లేదని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వారు భావోద్వేగపరంగా తెలివైన వాళ్లుగా మారతారట. వాళ్లు కూడా తమ ఎమోషన్స్ ఎక్ప్రెస్ చేయడం నేర్చుకుంటారట. ఇది సాధారణ జీవితానికి చాలా అవసరం. తల్లిదండ్రుల ఏడుపు పిల్లల భావోద్వేగ సెన్సిటివిటీ ని , సానుభూతిని పెంచుతుంది. బలమైన, సున్నితమైన వ్యక్తిత్వాలను అభివృద్ది చేయడంలో ఇది సహాయపడుతుందట. ప్రతికూల ప్రబావం.. పిల్లల ముందు ఏడవడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కంటే నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందట. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు నిరంతరం తమ భావోద్వేగ ఆందోళనలను వ్యక్తం చేస్తే, అది వారిలో అభద్రత, ఆందోళన, భయం వంటి భావాలను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా తమ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేని చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకోలేరు. ఇది వారి భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. పిల్లలు ఏడ్వడం చూస్తే.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూస్తే తరచుగా తమ ఎమోషన్స్ ను దాచడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. కానీ తల్లిదండ్రులు ఏడవడాన్ని పిల్లలు చూసినప్పుడు దానికి ల కారణాలను పిల్లలకు చెప్పాలి. ఇది పిల్లల భావోద్వేగ అవగాహనను పెంచుతుంది. అబద్దాలు వద్దు.. తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు పిల్లలు గమనించే ఏమైంది అని అడిగితే.. ఏం లేదు అని సింపుల్ గా దాటవేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇది సరికాదు. సరైన కారణం చెప్పకపోతే పిల్లలు కూడా తేలిగ్గా కాంప్రమైజ్ కారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి అలా నిజాయితీగా ఉండటమే నేర్చుకుంటారు. సమస్యలు, పరిష్కారాలు.. సమస్య రావడం, ఇబ్బంది పెట్టడం, పెద్దలు బాధపడటం ఇదంతా జరిగినట్టే పరిష్కారం కూడా ఖచ్చితంగా వస్తుంది. దీన్ని పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి గ్రహించగలిగితే.. సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు ఎలాగైతే బాధపడతారో.. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయనే ధైర్యం కూడా వారిలో ఏర్పడుతుంది. ఇది పిల్లల జీవితంలో మంచి జీవితానికి పునాది అవుతుంది. *రూపశ్రీ.
కాలాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తల్లిదండ్రులు కష్టమైనా, బాధ అయినా పిల్లలకు తెలియకుండా దాస్తుంటారు. అయితే కొన్నిసార్లు పిల్లల నుండి వాటిని దాచడం కష్టం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల ముందు భావోద్వేగానికి గురవుతారు. తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లల హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల బాధను చూసి, విచారంగా, నిశ్శబ్దంగా మారతారు. అయితే ఇలా పిల్లల ముందు బాధపడటం, ఏడ్వడం పిల్లల మీద ప్రభావం చూపుతుందా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/dont-be-too-emotional-infront-of-kids-35-207080.html





