తీవ్ర ఆందోళన వల్లే నానికి అస్వస్థత!.. తేల్చేసిన వైద్యులు?

Publish Date:May 24, 2024

Advertisement

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే  కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు  ఉన్న సంగతి తెలిసిందే. దాంతోనే కొడాలి నానికి తీవ్ర అస్వస్థత అనగానే అందరూ నమ్మారు. సరే తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ కొడాలి నాని ఆ వార్తలకు చెక్ పెట్టారు అది వేరే సంగతి.. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొడాలి నాని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులూ అక్కడే ఉన్నారు. శుక్రవారం( మే 23) కొడాలి నాని ఒక్కరే హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చారు. తన నివాసంలో నియోజకవర్గ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయారు. వెంటనే తేరుకున్నారు. వైద్యులు వచ్చి పరీక్షలు చేశారు. చాలా నీరసంగా ఉన్నారంటూ సెలైన్ కూడా పెట్టారు. 

ఇంతకీ నాని ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయి, అస్వస్థతకు గురి కావడానికి కారణమేంటి? అంటే వైద్యులు చెప్పిన దానిని బట్టి ఆయన తీవ్ర మానసిక వేదనలో ఉన్నారట. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారట. అది మానుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. ఇంతకీ ఆయన అంతగా ఆలోచిస్తున్నది దేని గురించి? ఆరోగ్యం చెడిపోయేంతగా ఆయన మానసికంగా ఎందుకు వేదన పడుతున్నారు? పరిశీలకులే కాదు.. ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులూ సైతం కొడాలి నాని ఎన్నికల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారనీ, విజయంపై అనుమానంతోనే తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారనీ అంటున్నారు. 
కాగా ఆ విషయాన్ని జనం కూడా నమ్ముతున్నారు.

ఎందుకంటే చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకున్నా, సందర్భం అయినా అసందర్భమైనా కొడాలి నాని ఎప్పుడూ తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అధినేతపైనా, అలాగే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైనా తనకు మాత్రమే ప్రత్యేకమైన అనుచిత భాషలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి కొడాలి నాని ఎన్నికలు పూర్తయిన నాటి నుంచీ నోట మాట లేకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన గుడివాడలో మరో సారి విజయం సాధించే అవకాశాలు లేవా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. పార్టీ శ్రేణులే ఈ సారి గుడివాడలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో గుడివాడ నాని అస్వస్థతకు కారణం తీవ్రంగా ఆలోచించడం, మానసిక ఆందోళన అన్న వైద్యుల మాటలు వాస్తవమేనని అంటున్నారు.

ఇలా ఉండగా కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకువెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాలని భావిస్తున్నారనీ..కొద్ది కాలం పాటు గుడివాడకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
కవిత కొత్త పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.