చీరాల, దర్శిలో కూటమి విజయంపైనే భారీగా పందేలు.. వైసీపీ ఆశలొదిలేసుకున్నట్లేనా?

Publish Date:May 24, 2024

Advertisement

ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని మిగిలిన పది నియోజకవర్గాలపై కంటే ఈ రెండు నియోజకవర్గాలలోనే గెలుపు గుర్రం ఏదన్నదానిపై పందెంరాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. 

ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని ముందు నుంచి పరిశీలకులు విశ్లేషణలు చేస్తూ వచ్చారు. దర్శి నియోజవర్గం విషయానికి వస్తే.. వైసీపీ ఇక్కడ చాలా ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసేసింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్న శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేనాటికి  ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ చార్జ్ కూడా లేడు. అంతే కాదు ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  దీంతో దర్శిలో వైసీపీ విజయం నల్లేరు మీద బండి నడకేనని అంతా భావించారు.  అయితే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.

జనసేనకు కేటాయించిన దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మి పోటీలోకి దిగారు.  ఈ మార్పు టీడీపీకి నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఏర్పడడానికి దోహదపడింది. అంతే కాకుండా తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమైక్యంగా లక్ష్మి విజయం కోసం పని చేశారు.  దీంతో దర్శి నియోజకవర్గ సీన్ ఒక్క సారిగా మారిపోయింది. పోలింగ్ రోజుల తెలుగుదేశం కూటమి అభ్యర్థి జోరు స్పష్టంగా కనిపించింది. 
అది నియోజకవర్గంలో గెలుపు ఓటములపై పందేలు ఒడ్డే పందెం రాయుళ్లు తొలుత భారీగా వైసీపీ విజయంపై బెట్టింగులు వేశారు. అయితే  పోలింగ్ తరువాత నుంచి ట్రెండ్ మారింది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటూ పందెం ఒడ్డే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి విజయం సాధిస్తారంటూ పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు.  ఆరంభంలో వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయన్నర వరకూ పందేలు కాసిన వారు ఇప్పుడు రూపాయికి రూపాయి అని కాయడానికి కూడా వెనుకాడుతున్నారు. అదే విధంగా ఆరంభంలో వైసీపీ అభ్యర్థి పదివేల మెజారిటీ సాధిస్తారంటూ పందేం ఒడ్డడానికి సిద్ధపడిన వారు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు.  

మరో వైపు తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు బెట్టింగులకు రెడీ అవుతున్నారు. అంతే కాదు మండలాలవారీగా ఆధిక్యతలపై కూడా పందేలు ఒడ్డుతున్నారు. ఇక చీరాల విషయానికి వస్తే.. పోలింగ్ కు ముందు వరకూ కూడా ఈ నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయం ఉండేది.

అయితే ఎప్పుడైతే సీనియర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారో అప్పటి నుంచీ చిరాలలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పెద్ద ఎత్తున పందెం ఒడ్డేందుకు పందెం రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఆమంచి పోటీలో ఉండటంతో వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయాయని అంటున్నారు. అంతే కాకుండా ఇక్కడ నుంచి తెలుగుదేశం బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం, అదే సమయంలో వైసీపీలో గ్రూపు తగాదాలు కూటమికి మొగ్గు రావడానికి దోహదపడిందని చెబుతున్నారు.  

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.