political-news-img

బిగ్ బాస్ బ్యూటీ అన్షురెడ్డిపై చీటింగ్ కేసు

సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ బ్యూట అషు రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువకుడి నుంచి ఏకంగా 9.35 కోట్ల రూపాయల నగదు, ఆస్తులు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కేవలం అషు రెడ్డిపైనే కాకుండా, ఈ మోసానికి సహకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులపై కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఎనుముల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ధర్మేంద్ర హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో అతడికి అషు రెడ్డితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అషు రెడ్డి నమ్మించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అషు రెడ్డి సోదరి కూడా ధర్మేంద్ర నుంచి సుమారు 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. 2018 నుంచి 2025 వరకు వివిధ రూపాల్లో సుమారు 9.35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు, దాదాపు 5 కిలోల బంగారాన్ని అషు రెడ్డికి ఇచ్చినట్లు సత్యనారాయణ ఆరోపించారు. చివరకు పెళ్లి ప్రస్తావన వస్తే సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో తాము మోసపోయామని గ్రహించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించగా, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు అషు రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె బ్యాంక్ లావాదేవీలు, గత కొన్నేళ్లుగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా దీనిపై అషు రెడ్డి ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

Publish Date: Apr 26, 2026 1:56PM

political-news-img

నార్సింగి సీఐపై సైబరాబాద్ కమిషనరేట్‌లో మహిళ ఫిర్యాదు

సైబరాబాద్ కమిషనరేట్‌లో నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి పై స్వాతి అనే యువతి ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయికిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కొంతకాలం సహజీవనం చేపి మోసం చేశాడనీ, దీంతో తాను గత ఏడాది అక్టోబర్‌లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్‌పై ఫిర్యాదు చేసినట్లు స్వాతి పేర్కొంది. అయితే నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి ఇన్ని నెలలు గడిచినా కూడా సాయి కిరణ్ పై సరైన విచారణ జరగలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను సాయి కిరణ్ వాళ్ల ఊరు విజయనగరం కు వెళితే... అక్కడ అతని తండ్రి రాజకీయ కార్యకర్త కావడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేశారని స్వాతి ఆరోపించారు. ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం.. కేసు పెట్టినా ఏం జరగదు.. చంపేస్తామంటూ బెదరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయబోతే.. వారు హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయమన్నారని పేర్కొన్న స్వాతి.. గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది. కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.

Publish Date: Apr 26, 2026 1:09PM

political-news-img

కవిత కొత్త పార్టీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి. ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు. కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా.. పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన.. ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.

Publish Date: Apr 26, 2026 12:46PM

political-news-img

చట్టాలు కాగితాలకే పరిమితమా? క్షేత్రస్థాయిలో న్యాయం అందని ద్రాక్షేనా?

దేశంలో చట్టాలు అత్యంత పటిష్టంగా, లోతైన విశ్లేషణతో రూపొందాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల నుంచి క్రిమినల్, సివిల్ చట్టాల వరకు ప్రతి అంశం కాగితంపై చాలా స్పష్టంగా, పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ చట్టాలు క్షేత్రస్థాయిలో సమాన్యులకు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. చట్టం బలంగా ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం. కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం. చట్టానికి, సమాజానికి మధ్య అగాధం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది. దేశంలో చట్టాలు ఐడిలిస్టిక్ కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. 1961లోనే కట్న నిషేధ చట్టం తీసుకువచ్చనా.. 2026 నాటికి కూడా వరకట్నం అన్నది సామాజికంగా ఒక ఆచారంగానే కొనసాగుతూనే ఉంది. అలాగే దేవాలయాల్లో నియమాలు కూడా, కోర్టు తీర్పులు ఎన్ని ఉన్న.. ప్రజలు సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే చట్టాలు సమాజాన్ని పై నుంచి మార్చాలని చూస్తున్నాయి తప్ప, క్షేత్ర స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రజలలో మార్పు తీసుకురావడంలో విఫలమవుతున్నాయి. భారత సమాజం చట్టం కంటే భయానికి, నీతికి ఎక్కువగా లొంగుతుంది. పేద వర్గాల్లో దేవుడి భయం, పాపం అనే భావనలు వారిని నైతికతకు కట్టుబడి ఉండేలా చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, సంపన్న, విద్యావంతులలలో విద్యావంతులైన మాత్రం అది కనిపించడం అరుదు. వీరిలో చట్టం పట్ల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. సిస్టమ్‌ను మేనేజ్ చేయవచ్చు, లేదా ఒక లాయర్‌ను పెట్టుకుని కేసును ఏళ్ల తరబడి సాగేలా చేయవచ్చ అన్న ధీమాయే వీరిలో చట్టం పట్ల భయం, గౌరవం తగ్గిపోవడానికి కారణమౌతోంది. ఫలితంగా.. చట్టం ద్వారా నిజమైన నియంత్రణ అనేది కానరావడంలలేదు. భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పెరిగిపోతున్న పెండింగ్ కేసులు. ఇవి గుట్టల్లా.. కాదుకాదు కొండల్లా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కేసులు పెండింగ్‌ ఉన్నట్లు అంచనా. వీటిలో 85 శాతం కేసులు దిగువ కోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు దశాబ్దాల పాటు సాగడం వల్ల తరతరాల జీవితాలు కోర్టుల చుట్టూ తిరగడంలోనే గడిచిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా, సగానికి పైగా కేసుల్లో ప్రభుత్వమే ఒక పక్షంగా ఉండటం వ్యవస్థపై అదనపు భారాన్ని పెంచుతోంది. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తున్నప్పటికీ.. వాటిని అమలు చేసే సొంత యంత్రాంగం కోర్టులకు లేదు. కోర్టు తీర్పు అమలు కావాలంటే పోలీసు, రెవెన్యూ శాఖల మీద ఆధారపడాల్సిందే. ఈ విభాగాలు అవినీతి, రాజకీయ ఒత్తిడి, పనిభారం వంటి వాటిలో కూరుకుపోయి ఉన్నాయి. దీంతో తీర్పు వచ్చినా బాధితుడికి న్యాయం అందడం లేదు. ఒక కేసులో గెలవడం అంటే సమస్య ముగియడం కాదు.. తీర్పు అమలు కోసం మరో కొత్త పోరాటం మొదలవ్వడమే అనే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. మరోవైపు, కోర్టులు మౌలిక వసతుల కల్పనపై కంటే.. , సామాజిక, మతపరమైన అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోర్టు భవనాల్లో కనీస సౌకర్యాలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ వంటి వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ జాప్యం కారణంగా ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి, అక్రమ పంచాయతీలు, స్థానిక స్ట్రాంగ్ మెన్ తీర్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. కోర్టులో 20 ఏళ్లు తిరగడం కంటే, అక్కడే తక్షణ పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. నిజమైన మార్పు రావాలంటే చట్టాల సంఖ్య కంటే వాటిలో స్పష్టత పెరగాలి. సామాన్యుడికి అర్థమయ్యేలా సరళమైన ప్రక్రియలు ఉండాలి. చట్ట ఉల్లంఘన జరిగితే శిక్ష పడుతుందనే భయం కలగాలి. ప్రభుత్వ లిటిగేషన్లను తగ్గించి, విచారణలు వేగంగా ముగిసేలా సంస్కరణలు చేపట్టాలి. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల మార్పు రాదు; గాంధీజీ వంటి సంస్కరణవాదులు చేసినట్లుగా సమాజం లోపల నుంచి మార్పు మొదలవ్వాలి. ఒక దేశ అభివృద్ధి కేవలం జీడీపీతో కొలవలేము. చట్టం, నీతి, దైనందిన జీవితం మధ్య ఉన్న అంతరం ఎంత తగ్గిందనేదే అసలైన అభివృద్ధి. చట్టం కేవలం కాగితంపై కాకుండా, సామాన్యుడికి భరోసా ఇచ్చే వెపన్ గా మారాలి. అప్పుడే ఇండియా నిజమైన ప్రగతి సాధించినట్లౌతుంది. References https://indiajusticereport.org/indicator/319/ijr-3/all-states/table?utm_source=copilot.com https://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India?utm_source=copilot.com - సీతారాం కంఠంనేని

Publish Date: Apr 26, 2026 12:45PM

political-news-img

వేషం మార్చిన జగన్.. మాజీ సీఎం విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత మరోసారి విదేశీ పర్యటన వెళ్లారు. ఆ సందర్బంగా ఆయన కొత్త లుక్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎప్పుడూ తెల్ల చొక్కా, ఖాదీ ప్యాంటుతో కనిపించే జగన్.. విదేశీ పర్యటనల సమయంలో పూర్తి భిన్నంగా మోడ్రన్ లుక్‌లో కనిపించడం రివాజే. జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం. కాగా జగన్ తాజా విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు ఈ సారి కఠిన షరతులు విధించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు, విదేశాల్లో ఉండే సమయంలో ఆయన ఉపయోగించే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడిలు, పూర్తి చిరునామాను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి కోర్టు విచారణకు హాజరు కావాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.

Publish Date: Apr 26, 2026 11:35AM

political-news-img

ఏబీవీ లిగల్ నోటీసులు ఎవరెవరికంటే?

తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, తన గౌరవానికి కలిగిన నష్టానికి గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాటి సీఎం జగన్ సీఎంఓలో సీపీఆర్‌ఓగా పనిచేసిన శ్రీహరి సహా పదిమంది పోలీసు అధికారులకు లీగల్ నోటీసులు పంపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ పరికరాల కొనుగోలుకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం సాగించడంలో సీపీఆర్‌ఓ శ్రీహరి కీలక పాత్ర పోషించారని ఏబీ ఆరోపిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి, మీడియాకు తప్పుడు సమాచారం చేరవేసి, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు వచ్చేలా చేశారని ఆయన మండిపడ్డారు. ఈ చర్యల వల్ల తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతిన్నదని, అందుకు శ్రీహరి బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం సీపీఆర్‌ఓ మాత్రమే కాకుండా, గతంలో తనను ఇబ్బంది పెట్టిన ఐపీఎస్ అధికారులు ఆర్‌పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్, రవిశంకర్ అయ్యన్నార్, పీఎస్సార్ ఆంజనేయులుకు కూడా ఆయన లీగల్ నోటీసులు పంపారు. వీరంతా కలిసి పథకం కుట్రపూరితంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారని, ఆధారాలు లేకపోయినా తనపై కేసులు బనాయించారని ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు కూడా ఫిర్యాదులు అందజేశారు. తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు జారీ చేసిన ఈ నోటీసులు ఇప్పుడు పోలీస్ శాఖలో సంచలనం రేపుతున్నాయి. ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి తన సహోద్యోగులపైనే ఈ స్థాయిలో న్యాయపోరాటానికి దిగడం కలకలం రేపింది. ఈ పరిణామాలపై ప్రస్తుత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బాధ్యులైన అధికారులపై విచారణకు ఆదేశిస్తుందా? లేదా ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ద్వారానే తన పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, తన నిజాయితీని నిరూపించుకోవడంతో పాటు, తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. తనపై కుట్రకు పునాదులు 2018లోనే పడ్డాయని పేర్కొన్న భద్రతా పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్‌ను 2018 డిసెంబరులో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా.. దురుద్దేశపూర్వకంగా రద్దు చేశారనీ.. కానీ ఆ విషయాన్ని ఫైళ్లలో ఎక్కడా పొందుపరచలేదని ఏబీవీ సాక్ష్యాధారాలతో పేర్కొన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత.. అప్పటి సీఎం జగన్ మెప్పు పొంది.. కీలక పోస్టింగ్‌ల కోసం వీరు తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ రికార్డులను సైతం తారుమారు చేసి కల్పిత కథనాలను సృష్టించి, తన పరువు ప్రతిష్ఠలను భంగం కలిగించేలా వ్యవహరించారని ఏబీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భద్రతా పరికరాల టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. గత కొన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్న ఏబీవీ.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వేధించడం వ్యవస్థకే తీరని నష్టమన్నారు. తనను ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారీ చట్టం ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందనీ, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీశాయి. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కూటమి సర్కార్ ఏ చర్యలు తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Publish Date: Apr 26, 2026 11:30AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img