దివ్యాంగుడు కష్టానికి మోక్షం కల్పించిన కేంద్ర మంత్రి

Publish Date:Feb 20, 2026

Advertisement

 

ఆయన పేరు నల్లి పోలయ్య.. పాతపట్నం మండల కేంద్రానికి చెందిన పోలయ్య.. పుట్టుకతో వికలాంగుడు.. మూడు చక్రాల ట్రై సైకిల్ పై అనేక ఆపసోపాలు పడుతూ.. తన దైనందిన కార్యక్రమాలు చేసుకునేవాడు.. ఇలా ఓ రోజు పాతపట్నంలో వెళుతూ ఉండగా.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఫోటోతో ఉన్న ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ఆయనకు తారసపడింది. కష్టం లేకుండా.. వేరొకరి తోడు అవసరం లేకుండా తన పనులు తాను చేసుకోవాలి అంటే ఎలక్ట్రిక్ సైకిల్ నే శ్రేయస్కరం అని భావించిన పోలయ్య.. గత సోమవారం నాడు శ్రీకాకుళం నగరంలో రామ్మోహన్ నాయుడు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు. 

జిల్లా వ్యాప్తంగా వచ్చిన వినతులతో రామ్మోహన్ నాయుడు కార్యాలయం కిక్కిరిసి ఉన్నా.. పోలయ్యను ముందుకు తీసుకువచ్చారు ఆయన సెక్యూరిటీ సిబ్బంది. కేంద్ర మంత్రి ఎదురుగా తన కష్టం అంతా చెప్పుకున్న పోలయ్య.. తనకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అవసరం ఉందని.. దాన్ని ఇప్పించాలని కోరాడు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. తన సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం నాడు పాతపట్నంలో ఉన్న పోలయ్యకు పలాస నుండి ఓ ఫోన్ వచ్చింది.. కేంద్ర మంత్రి  చెప్పడంతో మీకు ఒక ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ మంజూరు అయిందని.. మీరు మీ ధృవీకరణ పత్రాలతో వచ్చి.. దానిని తీసుకోవాలని చెప్పడంతో.. పోలయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబి అయ్యాడు. 

తన కష్టం చెప్పగానే ఆగమేగాల మీద దానికి పరిష్కార మార్గం చూపిన రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సుమారు ఏభై నాలుగు వేల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వల్ల ఇకపై తన దైనందిన కార్యక్రమాలు సులభతరం అయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాగా వికలాంగులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే విశేష కృషి రామ్మోహన్ నాయుడు చెయ్యగా.. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన పరికరాలు గడచిన కొన్నేళ్లుగా అందిస్తూ ఉన్నారు. 

అలెంకో, సామజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలను సమన్వయము చేసుకుని మూడు మెడికల్ క్యాంప్ లను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా  ఇప్పటికే 343 ఎలక్ట్రిక్ సైకిళ్ళు, 58 ట్రై సైకిళ్ళు, ఆర్టిఫిషియల్ లెగ్స్, హాండ్స్, వినికిడి యంత్రాలను విశేషంగా అందించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రతీ నెల మూడవ శుక్రవారం వికలాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సైతం వికలాంగులకు ఉపయుక్తంగా మారుతోంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా… తమకు పూర్తి తోడ్పాటు అందించేవిధంగా వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ.. తమ కష్టాలను గట్తెక్కిస్తున్న కేంద్రమంత్రికు సిక్కోలు వాసులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.


 

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.