ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్... విడుదలకు ట్రంప్ ఆదేశం

Publish Date:Feb 20, 2026

Advertisement

 

అమెరికాలో ఏలియన్స్, అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన రహస్య ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో గ్రహాంతర వాసుల ఉనికిపై దశాబ్ద కాలంగా సాగుతున్న అమెరికన్ల ఉత్కంఠకు తెరపడనుంది. 

ప్రజల్లో ఈ రహస్యాల పట్ల ఉన్న ఆసక్తిని తీర్చాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు ట్రంప్. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా.. గ్రహాంతరవాసులు ఉన్నారని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై ఒబామా నాడు మాట్లాడుతూ.. 'గ్రహాంతర వాసులు ఉన్నది నిజమే కావచ్చు. కానీ నేనెప్పుడూ వారిని చూడలేదు' అని అన్నారు. 

అమెరికాలోని ఏరియా 51లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో ఏలియన్స్ భూమిపై సంచరించినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టం చేశారు. అయితే.. ఈ సమాచారాన్ని ఒబామా బహిర్గతం చేయడాన్ని తప్పుబట్టారు ట్రంప్. క్లాసిఫైడ్ సమాచారాన్ని బయటపెట్టి ఒబామా పెద్ద తప్పుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 
 

By
en-us Political News

  
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.