అమెరికా అధ్యక్షుడు తలచుకుంటే.. అంతేనా?
Publish Date:Mar 2, 2026
Advertisement
అమెరికా బాగుంటే ఈ ప్రపంచం అంతా బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేయడానికి ముందు నుంచే.. అంటే అగ్రరాజ్యం తలచుకుంటే.. ఇంకా స్పష్టంగా అమెరికా అధ్యక్షుడు తలచుకుంటే.. ప్రపంచం శాంతిగా ఉండాలా, అశాంతితో, యుద్ధాలతో రగిలిపోవాలా అన్నది నిర్ణయించగలడన్న భావన ఉంది. అమెరికా అధ్యక్షులు గత కొంత కాలంగా నియంతల తలరాతలను తారు మారు చేస్తూ వస్తున్న వారే. అమెరికా అధ్యక్షుడు తలుకుంటే ఎంతటి నియంత తల అయినా ఎగిరిపోవల్సిందేనని తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ హతం కావడం మరోమారు రుజువు చేసింది. 2003లో జార్జ్ డబ్ల్యూ బుష్ నాయకత్వంలో సద్ధాం హుస్సేన్ ని ఉరి తీసి ఆయన నియంత్రత్వాన్ని అణగదొక్కింది అమెరికా అధ్యక్ష శక్తి. 2011లో లిబియా అధ్యక్షుడు ము గడాఫీని ఒబామా నాయకత్వంలోని నాటో సేనలు మట్టు పెట్టాయి. అంతకంటే ముందు 1989లో బుష్ నేరుగా సైనిక దాడి చేసి పనామా అధ్యక్షుడు మాన్యువల్ నోరిగాను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2026లో వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని కూడా అచ్చం ఇలాగే ఆయన నివాసం నుంచి తన సైనిక శక్తితో లిఫ్ట్ చేసి అమెరికా జైల్లో పడేశారు ట్రంప్. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ హయాంలో యుగస్లోవేకియాకి చెందిన స్లోబోడాన్ మిలోసెవిచ్ పై బాంబు దాడులు చేసి మరీ అంతర్జాతీయ కోర్టులో నిలబెట్టారు. జాన్ ఎఫ్ కెనడీ నాయకత్వంలోని అమెరికా సీఐఏ మద్దతుతో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు రాఫెల్ ట్రుజిల్లోను హతమార్చేశారు. 1963లో దక్షిణ వియత్నాం అధ్యక్షుడు న్గో దిన్ డైమ్ ని కూడా జాన్ ఎఫ్ కెనడీ నాయకత్వంలోనే ఖతం చేసేశాయి అమెరికన్ దళాలు. ఈ ప్రపంచం మొత్తం అమెరికా ఆడించే ఒకానొక తోలుబొమ్మలాట. ఈ దేశాధినేతలంతా దాదాపు కీలుబొమ్మలే.. ఒక రష్యా, మరో చైనా, ఇంకో భారత్ తప్ప.. మిగిలిన చిన్నా చితకా దేశాధినేతలంతా కలసి అమెరికా అధ్యక్షుడి చెప్పు చేతల్లో ఉండాల్సిన వారే. ఇరాన్ లో 1953లో జరిగిన ఘటన ఒక సారి పరిశీలిస్తే.. నాటి ప్రధాని మొసాద్దిక్ చమురు నిక్షేపాలను జాతీయం చేయాలని చూశారు. ఆనాటి అమెరిక అధ్యక్షుడు ఐసెన్ హోవర్ హయాంలో ఒక రహస్య ఆపరేషన్ ద్వారా ఆయన్ను పదవి నుంచి తప్పించి.. షాకు అధికారం అప్పగించింది అమెరికా అగ్ర నాయకత్వం. దటీజ్ ద పవర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్. 1973లో చిలీలో వామపక్ష భావజాలం కలిగిన సాల్వడార్ అలెండీని తొలిగించింది రిచర్డ్ నిక్సన్ హయాంలోని సీఐఏ. ఆ తర్వాత నియంత అగస్టో పినోచెట్ అధికారంలోకి వచ్చారు. వాళ్లు ఎంతటి నియంతలైనా కానీ, అమెరికా ముందు మాత్రం.. సలాం కొట్టాల్సిందే. జీహుజూర్ అనాల్సిందే. అవసరమైతే సాగిల పడాల్సిందే. అచ్చం పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లాగా. లేకుంటే వాళ్ల తలకాయలు లేచి పోతాయి. 2001లో జార్జ్ బుష్ ఆదేశాలతో జరిగిన దాడి ద్వారా ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీనికి కారణం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడులు చేసి దాన్ని నేలమట్టం చేయడమే. ప్రపంచ నాయకత్వ చరిత్ర ఈజీక్వల్టూ అమెరికన్ అధ్యక్షుల పాలనా చరిత్ర. అధ్యక్ష స్థానంలో ఎవరుంటే వారికి గులాములు కొట్టాల్సిందే. లేకుంటే వారి కట్టె కడతేరిపోతుంది. నేటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విషయం కూడా అంతే.. గత కొంత కాలంగా ఆయన్ను హెచ్చరిస్తూ వచ్చారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ వినలేదు. మీకెంత సైనిక శక్తి ఉందో మాకూ అంతే ఉందంటూ ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. పైపెచ్చు అణు శక్తిని పెంపొందించుకుంటూ వచ్చారు. ఒక సమయంలో అణు నియంత్రణ మండలి సైతం చెప్పి చూసినా ససేమిరా అన్నారు ఖమేనీ. ఇరాన్ చేతిలో ఉన్న ఆయుధ శక్తి హమాస్ హిజ్బుల్లా వంటి ఉగ్ర సంస్థలకు చేరుతోందన్న అనుమానాలు ఉన్నాయి. అది ప్రపంచ శాంతికే అత్యంత ప్రమాదకరం. దీంతో అమెరికా అధ్యక్షుడు తలుచుకున్నారు. ఖమేనీ హతమయ్యారు.
http://www.teluguone.com/news/content/dictators-fate-in-america-president-hands-36-214852.html





