డయాబెటిస్‌ రావాలా వద్దా... మన చేతుల్లోనే!

Publish Date:Sep 15, 2017

Advertisement

 

ఒకప్పుడు షుగర్‌ అంటే బాగా డబ్బున్నవాళ్లకి వచ్చే జబ్బనుకునేవారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తున్నారు. వంశపారంపర్యంగా షుగర్ ఉంటే, ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే! ఎలాంటి శారీరిక శ్రమా లేని జీవనశైలి కూడా ఈ వ్యాధి త్వరగా వచ్చేందుకు ప్రేరేపిస్తుందని తెలిసిందే! కానీ మనకి డయాబెటిస్ రావాలా వద్దా అని నిర్ణయించడంలో మన ఆహారానిదే ముఖ్య పాత్ర అని సరికొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

 

స్వీడన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఆహారపు అలవాట్లకీ, డయాబెటిస్‌కీ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం గోధెన్‌బర్గ్‌ అనే పట్నంలోని 600 మందికి పైగా ఆడవారిని ఎంచుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల వ్యవధిలో, మూడు దఫాలుగా వీరందరి ఆహారపు అలవాట్లనీ గమనించారు.

 

సాధారణంగా ఒకరి వ్యక్తిగత ఆహారపు అలవాట్లని నిశితంగా నమోదు చేయడం కష్టమవుతుంది. అందుకని పరిశోధకులు, అభ్యర్థుల రక్తనమూనాలని సేకరించారు. ఈ రక్తనమూనాలలో ఉండే పోషకాలని గమనించడం ద్వారా, వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ఒకొక్కరి నుంచి సేకరించిన నమూనా, వారి ఆహారాన్ని సూచించే వేలిముద్రలా (metabolic fingerprint) పనిచేస్తుందన్నమాట.

 

చేపలు, వంటనూనెలు, తృణధాన్యాలు, విటమిన్‌ ఈ కలిగిన పదార్థాలు ఎక్కువగా తినేవారిలో డయాబెటిస్ చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. అదే మాంసం, కొవ్వు పదార్థాలు తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్లు గ్రహించారు. అంటే మనం తినే ఆహారమే, భవిష్యత్తులో మనకి డయాబెటిస్ వస్తుందా రాదా అన్న విషయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నమాట.

 

ప్రపంచం మొత్తం మీదా డయాబెటిస్‌ ఎక్కువగా ఉండే దేశాలలో మనది రెండో స్థానం. మరో రెండు దశాబ్దాలలో మనదే మొదటి స్థానం అన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఆరుకోట్ల మందికి పైగా జనాభా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. సాధారణంగా 40 ఏళ్ల వచ్చేసరకి డయాబెటిస్‌ లక్షణాలు కనిపించడం మొదలుపెడతాయట. కాబట్టి చిన్నవయసు నుంచే పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లని నేర్పిస్తే... భవిష్యత్తులో వారు డయాబెటిస్‌కు వీలైనంత దూరంగా ఉంటారు. పైన పేర్కొన్న పరిశోధనే ఇందుకు సాక్ష్యం.

- నిర్జర.

 

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.