దేవాన్ష్ మై ఛాంప్.. లోకేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
Publish Date:Mar 20, 2026
Advertisement
రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి నారా లోకేశ్ ఉగాది పండుగ వేళ తన కుటుంబంతో గడిపిన విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఉగాది సందర్భంగా లోకేష్ ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో తన కుమారుడు దేవాన్ష్ ను తన ఛాంప్ అని పేర్కొన్నారు. దేవాన్ష్ తో కలిసి తాను దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. అంతే కాకుండా ఉగాది పర్వదినం సందర్భంగా ఆ ఒక్కరోజు తన ఫిట్‌నెస్ కోసం పాటిస్తున్న కఠినమైన డైట్‌కు బ్రేక్ ఇచ్చి మంచి భోజనం చేశానని కూడా పేర్కొన్నారు. లోకేశ్ తన డైట్, వర్కవుట్స్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. అయితే ఉగాది రోజున మాత్రం పిండివంటలతో కూడిన భోజనం కోసం డైట్ ను పక్కన పెట్టారు. లోకేష్ పోస్టుపై నెటిజనులు స్పందిస్తూ కఠినమైన డైట్ కు ఒక్కరోజు విరామం ఇవ్వడం మంచిదే.. పండుగను ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్లు పెట్టారు.
http://www.teluguone.com/news/content/devasnsh-my-champ-36-215799.html





