Publish Date:Mar 14, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు మరియు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్‌కు సంప్రదాయబద్ధంగా నూతన వస్త్ర బహుకరణ (ధోతీ) వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నారా, నందమూరి కుటుంబం సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయని ఈ వేడుక మరోసారి ప్రతిబింబించింది.హైదరాబాద్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో దేవాన్ష్‌కు ధోతీ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సంప్రదాయ పద్ధతుల్లో వేద మంత్రాల మధ్య పెద్దలు ఆశీర్వదిస్తూ దేవాన్ష్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య వేడుకను నిర్వహించారు. తాతల మురిపెం, అమ్మమ్మ–నాన్నమ్మల ఆశీస్సులు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మేనమామల ఆత్మీయత మధ్య దేవాన్ష్ ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు.
చిన్న వయసులోనే కుటుంబ సంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాన్ష్‌కు నూతన వస్త్రాలను అందించడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులు దేవాన్ష్‌కు ఆశీస్సులు అందిస్తూ ఆయన సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తుతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే నారా–నందమూరి కుటుంబం మరోసారి తమ సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devanshs-new-clothes-gifting-ceremony-36-215511.html
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.