డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్

Publish Date:Feb 5, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ క ల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ కూడా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గురువారం (ఫిబ్రవరి 6)న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీకి ఆయన హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.  

By
en-us Political News

  
 వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  సిఐడి  కోర్టులో  చుక్కెదురైంది.   కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ  బెయిల్ పిటిషన్ ను  దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, ముమ్మాటికీ నిజం. శాసన సభ వేదికగా ఆయన చేసిన ప్రసంగం మాటల్లోంచి, ఒక్క అక్షరాన్ని కూడా తప్పు పట్ట లేము. తీసి వేయలేము. సరే..కోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సభలో ప్రస్తావించ వచ్చునా? లేదా? అలా ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ అవుతుందా? కాదా? అన్నది, వేరే విషయం.
అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్  అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. పాస్టర్  భౌతిక  కాయాన్ని సికింద్రాబాద్  సెంటినరీ బాపిస్ట్ చర్చిలో  గురువారం సాయంత్రం( మార్చి 27) వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానికి బుధవారం (మార్చి 26) ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ( ఏప్రిల్ 1) నాటికి వాయిదా వేసింది. అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.
వైసీపీ నాయకురాలు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట లభించలేదు. అవినీతి కేసులో విడదల రజని దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం (మార్చి 27) విచరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.
ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు.
విదేశాలకు వలస వెళ్లడం అంత ఆష మాషి  కాదు. స్వంత గూడు వదిలి విదేశాల్లో  స్థిరపడాలనుకోవడం అంత మామూలు విషయం కాదు.  భారత్ లో మిత వాద రాజకీయాలు,  విభజించి పాలించే రాజకీయాలు దేశంలోని అత్యంత సంపన్నులు విదేశాల్లో సెటిల్ కావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  ఓ వైపు పన్నుల ఒత్తిడి , రాజకీయ కక్ష్య సాధింపు చర్యల కారణంగా మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కక్ష సాధింపు, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడటమే పాలన అన్నట్లుగా సాగింది. చట్టాలకు తిలోదకాలిచ్చేసి ఇష్ఠారీతిగా చెలరేగిన వారందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం ముందు నిలబడకతప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నేరాల అదుపునకు, నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ లో నేరాలను అదుపు చేయడమే కాక, నియంత్రించవచ్చని పదే పదే చెబుతూ వస్తున్నారు.
లక్షల మందితో వరంగల్‌లో ప్లీనరీ నిర్వహించి క్యాడర్‌లో జోష్ నింపాలని ఫిక్స్ అయింది గులాబీ పార్టీ. అయితే వారికి వాతావరణం, పరిస్థితులు అనుకూలించడం లేదంట. దాంతో సభను వాయిదా వేస్తే మరింత పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, అందుకే సభాస్థలి మార్చడానికి ఫిక్స్‌ అయ్యారంట.
టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి శ్రీధ‌న్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.