Publish Date:Nov 18, 2024
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.రోజూ ఎక్కడో అక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం అయ్యాయని, బ్యాంక్ వారు చేతులెత్తేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చిన తరువాత. ఈ నేరగాళ్లు మరీ విజృంభించేస్తున్నారు. ఏదో మెసేజ్ రావడం దానిని క్లిక్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఖాలీ అయిందని వింటూ ఉంటాం.ఇటీవల మీ కేవైసీ చెక్ చేస్తున్నామని ఫోన్ రావడం,ఓటీపీ చెప్పమనడం వంటి నేరాలు కూడా పెరిగిపోయాయి. కరోనా తరువాత మనీ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి.
కూరగాయల నుంచి ప్రతి వస్తువు కొనుగోలు విషయంలోనూ డజిటల్ ట్రాన్సాక్షన్స్ కే జనం మొగ్గు చూపుతున్నారు. జేబులో డబ్డులు ఉంచుకోకుండా.. ఫోన్ ద్వారానే కొనుగోళ్లు కానిచ్చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు,ఇతర ఆదాయాలు బ్యాంక్ ఖాతాలోకి జమ కాగానే దానిని డిజిటల్ సౌకర్యంతో స్వేచ్ఛ గా ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రొత్సహిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల వల్ల పెద్ద నోట్లు దగ్గర ఉంచుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే చిల్లర లేదు అన్న బాధ కూడా పూర్తిగా తొలగిపోయింది. దీంతో దేశంలో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ కు జనం సులువుగా వేగంగా అలవాటు పడిపోయారు. ఫోన్ నంబరు బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేయడంవల్ల డిజిటల్ లావాదేవీలు సులభమయ్యాయి.ఇది సైబర్ నేరగాళ్లకు ఓ అవకాశంగా మారిపోయింది. దీనికి తోడు ఆధార్ అన్ని బ్యాంకు అకౌంట్లకు సంధానం చేయడం కూడా సైబర్ నేరగాళ్లకు సులువుగా జనం ఖాతాలలోంచి సొమ్ము కాజేసే అవకాశాన్ని ఇచ్చింది. వాట్సాప్,మెయిల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేయడం సాధారణమై పోయింది.
ఇలా సైబర్ నేరగాళ్ల వలలో పడటంలో ప్రజల అలక్ష్యం, అమాయకత్వం ఎంత కారణమో అంతకంటే ఎక్కువగా బ్యాంకు నిర్లక్ష్యం, ఆర్బీఐకి జవాబుదారీ తనం లేకపోవడం కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. డిజిటల్ మనీ ట్రాన్స్ ఫర్ల విషయంలో బ్యాంకులకు సొంత చెక్ వ్యవస్థ ఉండాలి. అలాగే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా మనీ ట్రాన్స్ఫర్ విషయంలో ఒక అంతర్గత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయంలో బ్యాంకులు, ఆర్బీఐ అవసరమైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే సైబర్ నేరగాళ్లు ఆటలు సాగు తున్నాయి.అమాయక ప్రజల సొమ్ములు ఖాళీ అవుతున్నాయి. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా సైబర్ నేరాల అదుపులో బ్యాంకులు చేతులెత్తేయడం దౌర్భాగ్యమనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cyber-terror-in-nation-nation-39-188568.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.