ఓటీపీతో పని లేకుండానే ఖాతాలు ఖాళీ!
Publish Date:Oct 7, 2025
Advertisement
బిగ్ బ్యాస్కెట్ పేరుతో బడా మోసం ఆన్ లైన్ మోసాలు మితిమీరి పోతున్నాయి. ఏది అసలో ఏది నకిలీయో తెలియనంతగా ఈ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. మీ బ్యాంకులో డబ్బులుంటే చాలు అవి ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో దండెత్తుతున్నారు. తాజాగా యూసఫ్ గూడాలో ఓ వ్యక్తి బిగ్ బాస్కెట్ పేరిట మోస పోయిన విధం దిగ్భ్రమగొల్పేలా ఉంది. అదెలాంటిదంటే మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు కిరాణా సరుకులు. ఆలసించిన ఆశా భంగం. మంచి తరుణం మించిపోతోందన్న ప్రకటన చూసి.. నిజంగానే ఇదంతా దసరా, దీపావళి ఢమాకా ఆఫర్ అనుకున్నాడు. దానికి తోడు అది షారూఖ్ ఖాన్ వంటి బడా స్టార్స్ ప్రమేట్ సేసే బిగ్ బాస్కెట్ కావడంతో.. క్షణం ఆలోచించకుండా ఆ యాడ్ కు రెస్పాండ్ అయ్యాడు. వాట్సప్ ద్వారా వాళ్లు పంపిన ఏపీకే లింక్ క్లిక్ చేశాడు. ఇలా క్లిక్ చేశాడో లేదో.. అలా కనీసం ఓటీపీ నంబర్ కూడా అడగకుండానే లక్షా 97 వేల రూపాయలను అతడి బ్యాంక్ అక్కౌంట్ నుంచి ఖాళీ అయిపోయాయి. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా వ్యక్తికి. ఇదేంటి? చౌక దరలకు కిరాణా సామాన్లు వస్తాయనుకుంటే.. మన దగ్గర నుంచి ఎలాంటి ఓటీపీ అడక్కుండానే డబ్బులాగేశారంటూ లబోదిబోమనడం అతడి వంతయ్యింది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న స్కాముల్లో ఓటీపీలు అడగటంతో డౌట్ వచ్చేది. ఆ దిశగా అందరూ చాలా వరకూ అలెర్ట్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఓటీపీ నంబర్ తో పని లేకుండా సొమ్ము ఖాతాల నుంచి ఖాళీ చేయడమనే కొత్త ట్రిక్ తో సైబర్ నేరగాళ్లు ఆరితేరిపోయారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏంటన్నది? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటోంది సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్.
http://www.teluguone.com/news/content/cyber-crimes-new-methods-36-207499.html





