ఇక క‌రెన్సీ నోట్ల బాగోగులూ చూసుకోవాలి!

Publish Date:Jul 4, 2022

Advertisement

ప్ర‌జ‌ల్ని ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల‌కు గురిచేయ‌కుండా వుండేది మంచి పాల‌న‌. మాటి మాటికి ఏదో ఒక కొత్త నిబంధ‌న‌ల‌తో వేధించేది అస‌లు ప్ర‌భుత్వ‌మ‌నిపించుకోదు. న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం నోట్ల మార్పిడి నిర్ణ‌యంతో గ‌తంలో సామాన్య జ‌నాన్ని గ‌తంలో ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇపుడు కొత్త‌గా మ‌రో ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఎంచుకుంది. మ‌నిషి ఆరోగ్యంగా వున్న‌దీ లేనిదీ ఫిట్నెస్ టెస్ట్ పెట్ట‌డం పోలీసు, ఆర్మీ వుద్యోగాల్లో మామూలే. క‌రెన్సీ నోట్లు ఫిట్నెస్ త‌నిఖీ చేసే యంత్రాల‌ను రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు ప్ర‌ధాని. బ్యాంకుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో నోట్ల‌ను లెక్కించే మిష‌న్లే ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. ఇక నుంచి మ‌నం జేబులోంచి ఇచ్చే ప‌ది, ఇర‌వై, యాభై, వంద నోట్లు కాస్త‌ కూడా న‌ల‌క్కుండా, మ‌ట్టి ప‌ట్ట‌కుండా వుండాలిట‌! చిన్న‌పాటి చిరుగు వున్నా ప‌నికిరాద‌ట‌. అలాంటి నోట్ల‌ను ప‌నికిరాని నోట్లుగా ప‌రిగ‌ణిస్తార‌ట‌. దేనిక‌యినా ఒక అంతూ పొంతూ వుండాలి. 

అదేమాలోచ‌న‌? క‌రెన్సీ నోట్లు త‌యార‌యి వ‌చ్చిన కొత్త‌ల్లోనే త‌ళ‌త‌ళ‌లాడేది, గ‌ట్టిగా క‌నిపించేది. జ‌నాల వాడ‌కంలో వాటి రూపు రేఖ‌ల్లో కాస్తంత మార్పువ‌స్తుంది. స‌హ‌జం. కానీ అలా జ‌ర‌గడానికి వీల్లేద‌ని  ఏకంగా కేంద్ర‌మే చెబితే ఇక మామూలు చిన్న‌పాటి వుద్యోగి, ప‌నివాళ్లు ఎలా వాటిని కాపాడుకుంటారు? నోటు రంగు పోయినట్లయితే అది పనికిరాని నోటు. చిరిగిన నోటుపై ఏదైనా రకమైన టేప్ అతికించి ఉంటే ఆ నోట్లు పనికిరావు. నోట్ల రంగు పోయి లేదా తేలికగా మారినట్లయితే అవి అన్ ఫిట్ కేటగిరీలో చేర్చుతారు. ఫిట్ నోట్ అనేది వాస్తవమైన తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేస్తుంది. ఇలాంటి నోట్లని గుర్తించడానికి కొత్తగా మెషీన్లని తయారుచేస్తోంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను మాత్రమే వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అస‌లే ఆటోవాళ్లు, బ‌స్సులో కండెక్ట‌ర్లూ కాస్తంత బాగా న‌లిగినా, చిన్న‌పాటి చిరుగు క‌నిపించినా ఏదో పెద్ద నేరం చేసిన‌ట్టు చూసి వాటిని తిర‌స్క‌రిస్తున్నారు. స‌రిప‌డా చిల్ల‌రా లేక‌, అటువంటి నోట్ల‌తో బ‌స్సో, ఆటో ఎక్కిన‌వారంతా స‌ద‌రు డ్రైవ‌ర్‌చేతిలో వినిపంచి వినిపించ‌ని స్వ‌రంలో తిట్ల‌నీ తింటున్నారు. మొత్తానికి రోజులు ఇలా గ‌డుస్తున్నాయి. ఇపుడు హ‌ఠాత్తుగా న‌లిగిన నోట్ల సంగ‌తి సీరియ‌స్‌గా తీసుకోమ‌ని ఆర్బీఐకి కేంద్రం సూచించ‌డం దారుణం. ఫిట్నెస్ లేని నోట్లు రీసైక్లింగ్‌కీ ప‌నికిరావ‌ట‌! దేశంలో మొత్తం న‌లిగిపోయిన నోట్ల‌ను తిరిగి బ్యాంకుల‌కు అప్ప‌గించ‌మ‌ని ఆదేశిస్తే మ‌ళ్లీ అంద‌రూ బ్యాంకుల ముందు వ‌రుస‌గా నిల‌బ‌డి మ‌ళ్లీ రోజుల త‌ర‌బ‌డి అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. ప్ర‌భుత్వం పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల అమ‌లు కంటే ఇలా ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టే అంశాలు, మార్గాన్వేష‌ణ‌లోనే బాగా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేమిటి?  ప్ర‌తీ నోటు కొంత‌కాలం త‌ర్వాత న‌లిగిపోతుంది, ఇస్త్రీ చొక్కాలా స్టిఫ్‌గా, కొత్త సిగెరెట్ ప్యాక్లా త‌ళ‌త‌ళ‌లాడ‌దు. 

ఇంత‌కంటే పేద బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వారి సేవ‌ల‌కు త‌గిన ప‌లితం ద‌క్కుతోందా, వారిని నిజంగా ఆదుకునేంద‌కు ఎలాంటి ప‌థ కాలు స‌క్ర‌మంగా అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌చేస్తే మంచిది. నోట్లు బాగుండాలి, రోడ్లు బాగుండాలి వంటి నినాదాలు, ప్ర‌చారాల కంటే వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు అయ్యేట్టు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం ఎంతో మంచిది, అవ‌స‌రం. ప్ర‌జ‌ల్ని కేవ‌లం ఓట‌ర్లుగానే భావించ‌డం త‌గ్గించుకోవాలి. నోట్ల మీద వున్న శ్ర‌ద్ధ మ‌నుషుల బాగోగుల మీదా వుండాలి.

By
en-us Political News

  
15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది.
బీజేపీవారికున్నంత దేశ‌భ‌క్తి మాకు లేదుగాని మాకున్నంత‌లో మాదీ దేశ‌భ‌క్తే అంటున్నారు కూర‌ గాయ‌ల మార్కెట్లో దుకాణాల‌వారూ
త‌న ఎంపీయే ఊహించ‌నివిధంగా ప‌ట్టుబ‌డినా అదంతా క‌ట్టుక‌ధే అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హరించ‌డంప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.
గోరంట్ల వ్య‌వ‌హారం పై విచార‌ణ జ‌రిపి వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. అలాగే లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ రేఖా శ‌ర్మ‌కీ గిల్ లేఖ రాశారు.
అన్న‌య్య స‌న్నిధి.. అదే నాకు పెన్నిధి.. అంటూ చెల్లెలు అన్న‌గారి కాళ్ల‌ మీద ప‌డి క‌న్నీళ్ల‌తో క‌డిగిన‌పుడు ప్రేక్ష‌కులు అన్న‌గారినే మెచ్చుకున్నారు. సినిమాలో చెల్లెలు నిజంగానే వీర ప్రేమ ప్ర‌క‌టించింది గ‌నుక‌. అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ త‌రిగిపోతుందా అంటే అసాధ్య‌మంటారు పెద్ద‌వాళ్లు.. కానీ ఇప్పుడు అవ‌స‌రార్ధం ప్రేమ‌నే ప్ర‌క‌టించారు వైసీపీ చెల్లెళ్లంతా!
తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రచారంపై అభ్యంతరం తెలిపింది.
స‌రిగ్గా ఆజాదీ కా అమృతోత్స‌వ్ స‌మ‌యంలోనే విపరీతంగా  ప్ర‌చారం చేస్తోంది మోడీ ప్రభుత్వం
వైసీపీ ఎంపీ న్యూడ్ కాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళతో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు అందింది.
తాజాగా హార్వ‌ర్డ్ వ‌ర్సి టీలో ఇద్ద‌రు త‌మ స్నేహం గురించి తెలియ జేశారు. ఒక‌రు భార‌త్‌కి చెందిన అమ్మాయి, మ‌రొక‌రు పాకి స్తాన్! వీరిద్ద‌రూ చాలాకాలం త‌ర్వాత క‌లిసేరు. కానీ అంతే స్నేహ‌పూర్వ‌కంగా, మ‌రెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్ల‌కు పాక్ స్నేహితురాలిని క‌ల‌వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని స్నేహా ప్ర‌క‌టించింది. 
ఒక‌రి గొప్ప‌త‌నాన్ని ఓర్వలేని తనంతో తిరస్కరించడం,ఒక‌రి దార్శనికత జాతికి మేలు చేస్తుందని తెలిసినా నిర్ల‌క్ష్యం చేయ‌డ‌మో అమ‌లు కాకుండా అట‌కెక్కించ‌డ‌ం క్ష‌మార్హం కాదు. క్షంతవ్యం కాదు. జగన్ సర్కార్ సరిగ్గా అలా క్షంతవ్యంకాని వ్యవహార శైలినే ఈ మూడేళ్లుగా చేస్తూ వస్తున్నది. నాడు నారా చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా రాజ‌ధాని నిర్మాణ ప‌ను ల‌ కోసం విదేశీయుల‌తో సంప్ర‌దిచ‌డం మీద అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న దూర‌దృష్టిని గ్ర‌హించి విమర్శకులంతా ఆ తరువాత మెచ్చుకున్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు.
ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ, తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.
తెలంగాణా ప్ర‌భుత్వం కూడా పాటించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుంది. కేంద్రం అజాదీ కా అమృ తోత్స‌వం సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌క‌టించిన కేంద్రానికి ధీటుగా తెలంగాణా ప్ర‌భుత్వం కూడా స‌రికొత్త వ్యూహం అనుస‌రించి తెలంగాణా ఆక‌ర్ష్ కి మ‌రింత ద‌న్ను ఇచ్చారు.
లేటెస్టుగా ప్ర‌ధాని ర‌క్షాబంధ‌న్ అడ్డంపెట్టుకుని మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 10) ఢిల్లీలో  ప్ర‌ధాని త‌న కార్యాల‌యంలో ప‌నిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్ల‌ల్ని పిలిపించి వారితో రాఖీ క‌ట్టించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.