ఖ‌మ్మం లోక్ సభ అభ్య‌ర్థిగా పొంగులేటి వియ్యంకుడు.. కాంగ్రెస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

Publish Date:Apr 24, 2024

Advertisement

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్  హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చివ‌ర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. త‌ద్వారా పార్ల‌మెంట్ ప‌రిధిలోని రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచించిందని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 
 
తెలంగాణ‌లో మొత్తం 17లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల విజ‌యంకోసం కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అయితే  ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. గురువారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుండ‌టంతో బుధ‌వారం రాత్రి  మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది.

ఖమ్మం  లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం భారీ  క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప‌రిశీలించింది. జిల్లాలోని పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన అధిష్టానం.. మెజార్టీ అభిప్రాయాల మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురాంరెడ్డి పేరు ఖరారుచేసింది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటును త‌మ అనుచ‌రుల‌కే ద‌క్కేలా జిల్లాలోని ముగ్గురు మంత్రులు పోటీ ప‌డ్డారు. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా లెక్క‌ల‌ను బేరీజు వేసుకొని అధిష్టానం చివ‌రికి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి పేరును అధిష్టానం  ఖరారు చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది.

రామ స‌హాయం రఘురామి రెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి. గ‌తంలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేకాక‌..  సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా   వియ్యంకుడే. హీరో వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత‌ను ఆయ‌న పెద్ద కుమారుడు వినాయ‌క్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుమార్తె స్వ‌ప్నిరెడ్డిని ఆయ‌న చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. అయితే  ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ ఎస్‌ నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. మ‌రోసారి బీఆర్ ఎస్ అధిష్టానం ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. నామా నాగేశ్వ‌ర‌రావు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రాష్ట్రంలో ప‌దిహేడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం తొలుత ప్ర‌క‌టించిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి  అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో, ఖ‌మ్మం నుంచి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్  అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే  టికెట్‌ కేటాయించింది. రామ‌స‌హాయంకు టికెట్ కేటాయించ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్య‌క్తికే టికెట్ కేటాయిస్తూ వ‌స్తున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం అదే విధానాన్ని కొన‌సాగిస్తూ నామా నాగేశ్వ‌ర‌రావునే మ‌రోసారి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. ఖ‌మ్మంలో  తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వారు నామావైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో నామాకు గ‌ట్టిపోటీ ఇచ్చేలా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌రిలోకి దింపాల‌ని  కాంగ్రెస్ అధిష్టానం ఒక దశలో భావించింది.  అయితే స్థానికేతరుడు అన్న అభ్యంతరాలు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్య‌క్తి కావడంతో  అధిష్టానం మండ‌వ పేరును ప‌క్క‌న పెట్టింది. నామాను ఢీకొట్టేందుకు కమ్మ సామాజిక వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత లేక‌పోవ‌టంతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   వియ్యంకుడు అయిన రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రామ స‌హాయంకు విక్ట‌రీ వెంక‌టేశ్ కుటుంబంతో బంధుత్వం ఉండ‌టంతో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు బ‌ల‌మైన‌ సామాజిక  వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అధిష్ఠానం భావించినట్లు కనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.