ఏపీలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణేది? దిశ ఏమైంది? జ‌గ‌న‌న్న వ‌ల్ల కాదా?

Publish Date:Aug 16, 2021

Advertisement

'అర్ధ‌రాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం. ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా దిశ చట్టాలు, యాప్‌లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ‌ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?' అంటూ యువనాయ‌కుడు ప‌రిటాల శ్రీ‌రామ్ వ్య‌క్తం చేసిన‌ ఆగ్ర‌హం నిజంగా చ‌ర్చ‌ణీయాంశం. 

అవును, ఏపీకి ఏమైంది? దిశ చ‌ట్టం ఆడ‌పిల్ల‌ల‌పై నేరాలు-ఘోరాల‌ను ఆప‌గ‌లిగిందా? దిశ యాప్ ఆప‌త్కాలంలో ఆదుకుందా? ప్ర‌భుత్వ ప్ర‌చార ప్ర‌టోపాలే కానీ.. అమ‌లులో దిశ విఫ‌ల‌మైందా? జ‌గ‌నన్న పాల‌న‌లో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ క‌రువైందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. వాటిపై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు. 

ఒక‌టి రెండు కాదు.. వ‌రుస ఘ‌ట‌న‌లు.. గ‌డిచిన రెండేళ్ల‌లో అనేక దారుణాలు. ఆడ‌పిల్ల‌ల‌నే కాదు చిన్నారుల‌పైనా ఘోరాలు. మొన్న‌టికి మొన్న తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ ప్యాలెస్ ఉన్న ఏరియాలోనే కృష్ణాన‌ది తీరంలో యువ‌తిపై అత్యా-చారం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇద్ద‌రే నిందితులు. వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసుల‌కు చుక్కలు క‌నిపించాయి. నెల‌లు గ‌డిచాక ఇద్ద‌రిలో ఒక్క‌రిని మాత్ర‌మే ఇటీవ‌ల ప‌ట్టుకున్నారు. మ‌రొక‌డు ఇప్ప‌టికీ ప‌రారీలోనే ఉన్నాడు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాస చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతంలోనే ఆడ‌పిల్ల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌లేక‌పోయిన ఈ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలి? ఏం చేయాలి?

స‌ర్కారు వైఫ‌ల్యాన్ని క‌ప్పుపుచ్చుకునేందుకే అన్న‌ట్టు హ‌డావుడిగా దిశ యాప్ తీసుకొచ్చారు. పే..ద్ద స‌భ పెట్టి హంగామాగా దిశ యాప్ ప్రారంభించేశారు. ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టారు. అయినా ఏం లాభం? మ‌హిళ‌ల‌కు ఏం ప్ర‌యోజ‌నం? దిశ యాప్ అమ‌ల్లోకి వ‌చ్చి నెల గ‌డ‌వ‌గానే.. గుంటూరులో ఉన్మాది శివ‌కృష్ణ చేతిలో బీటెక్ స్టూడెంట్‌ ర‌మ్య‌శ్రీ దారుణ హ‌త్య‌కు గురికావ‌డం.. ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అంటున్నారు. నేర‌గాళ్ల‌లో భ‌యం క్రియేట్ చేసేలా స‌ర్కారు స‌రైన‌న చ‌ర్య‌లు తీసుకోలేక‌పోవ‌డం వ‌ల్లే క్రిమిన‌ల్స్ ఇలా చెల‌రేగిపోతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ర‌మ్య‌శ్రీని ఆ ఉన్మాది వెంటాడాడు. చేయిప‌ట్టుకొని బ‌ల‌వంతంగా లాగాడు. కొంత‌దూరం పాటు ఆమెవెంటే ప‌డ్డాడు. వాడి నుంచి త‌ప్పించుకునేందుకు పాపం ఆ అమ్మాయి పెనుగులాడుతూనే ఉంది. ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా అదే చేస్తారేమో. అయినా వాడు వ‌ద‌ల‌కుండా ఆమెను క‌త్తితో ఆరు పోట్లు పొడిచాడు. ఆ దుర్ఘ‌ట‌న‌ను అడ్డుకోడానికి దిశ యాప్ ఎలా ప‌నికొస్తుంది? దాని వ‌ల్ల ఉప‌యోగ‌మేంటి? త‌న‌ను అలా క‌త్తితో పొడుస్తాడ‌ని ఆమె ముందే ఊహించ‌క‌పోవ‌చ్చు. ఆ స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌నే చూస్తారు కానీ.. దిశ యాప్ అనేది ఒక‌టుంది. ఫోన్ తెర‌చి.. దిశ యాప్ ఓపెన్ చేసి.. బ‌ట‌న్ నొక్కాల‌నే ఐడియా వెంట‌నే త‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఒక‌వేళ ఆ ప‌ని చేసినా.. దిశ పోలీసులు వ‌చ్చే స‌రికి.. జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయి ఉండేది. అంటే, దిశ యాప్ అన్నివేళ‌లా, అంద‌రికీ, అన్ని ఘ‌ట‌న‌ల్లో ఉప‌యోగ‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అంటే, కేవ‌లం దిశ తీసుకొచ్చి.. ఇక తాము మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేశామంటూ జ‌గ‌న్ స‌ర్కారు జెబ్బ‌లు చ‌రుచుకోవ‌డం సిగ్గుచేటు..అంటున్నారు. 

తమ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆడ‌పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ జ‌గ‌న్ చెబుతున్నారు. మ‌హిళల ర‌క్ష‌ణ కోస‌మంటూ.. దిశ చ‌ట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. ఇవేవీ అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతున్న తీరు చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఓ మ‌హిళ‌ను నియ‌మించామ‌ని జ‌గ‌న్ గొప్ప‌లు చెబుతున్నారు. ఆ మ‌హిళా హోం మినిస్ట‌ర్ సొంత జిల్లాలోనే ఉన్మాది చేతిలో ర‌మ్య‌శ్రీ దారుణ హ‌త్య‌కు గురికావ‌డం స‌ర్కారు వైఫ‌ల్య‌మే అంటున్నారు. నిందితుడిని ప‌ట్టుకొని క‌ఠిన శిక్ష విధించినా.. బాధిత కుటుంబానికి 10 ల‌క్ష‌లు ప‌రిహారం అందించినా.. పోయిన ప్రాణం తిరిగి వ‌స్తుందా? ఆ కుటుంబ శోకం తీరుతుందా? ప్రాణం పోకుండా క‌దా ప్ర‌భుత్వం చూడాల్సింది? అంటున్నారు. 

గుంటూరు ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్య‌క్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని మండిప‌డ్డారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జ‌గ‌న్‌ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని ఆరోపించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం జ‌గ‌న్‌ సోదరి.. వైఎస్‌ సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటు, ర‌మ్య‌శ్రీ మృత‌దేహానికి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. మ‌హిళ‌ల‌పై నేరాలు-దారుణాలు ఆగ‌డం లేదంటూ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు నారా లోకేశ్‌. 

ర‌మ్య‌శ్రీ ఘ‌ట‌న‌తో జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన‌ట్టైంది. ఏపీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నేరం చేయాలంటేనే భ‌యం క‌లిగేలా, దారుణం జ‌ర‌గ‌కుండా అడ్డుకునేలా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు, విధానాలు ఉండాలి కానీ.. ఏదో ప్ర‌చారం కోసం పైపై చ‌ర్య‌లు చేప‌డితే.. స‌రైన ఫ‌లితం ఉండ‌ద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.