పాతికేళ్ల తర్వాత మళ్లీ తాలిబన్ రాజ్యం.. భయంభయంగా అప్ఘనీస్తాన్ జనం..

Publish Date:Aug 16, 2021

Advertisement

పాముల పుట్ట ఒక్కసారిగా చెదిరితే ఎలా ఉంటుంది? కలుగులో దాక్కున్న విషనాగులన్నీ వీధుల్లో స్వైర విహారం చేస్తే ఎలా ఉంటుంది? ఆఫ్ఘనిస్థాన్లో 1994 తరువాత నెలకొన్న దారుణ పరిస్థితులను ప్రపంచం ఇంకా మరచిపోలేదు. అవే దుష్పరిణామాలను మరోసారి నెమరు వేసుకునే పరిస్థితులు ఆఫ్ఘన్లో దాపురించాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ నుంచి క్రమంగా వెను దిరుగుతున్న క్రమంలోనే ఆఫ్-పాక్ సరిహద్దుల్లో మాటువేసి ఉన్న తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం చేసుకున్నారు. అధ్యక్షుడి భవనాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు అధ్యక్షుడు తన సిబ్బంది సహా కజకిస్తానో, కిర్గిజిస్తానో పారిపోయాడు. ఇంకేముంది? తాలిబాన్లు పాలనా పగ్గాలు చేపట్టడం లాంఛనంగానే మిగిలింది. 

తాలిబాన్లంటే ఇంత వణుకెందుకు?

తాలిబాన్ల పరిపాలన ఎలా ఉంటుందో ప్రపంచం ఇప్పటికే రుచి చూసింది. వారి ఆలోచనలు, వారి కార్యాచరణ ఎలా ఉంటుందో పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. అసలు తాలిబాన్ల డిక్షనరీలో ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమే లేదంటే అతిశయోక్తి కాదు. షరియా చట్టాన్ని విశ్వవ్యాప్తం చేయడమే వీరి లక్ష్యం. తాలిబాన్లు, ఐసిస్, ముజాహిదీన్లు.. ఇలా ఏ పేరు చెప్పుకున్నా.. అందరి లక్ష్యం ఒకటే. అందుకే వేర్వేరు ఆర్గనైజేషన్ల కింద పనిచేస్తున్నవారు సైతం ఏ సమయంలోనైనా ఒక్కటిగా మారిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో జరిగింది కూడా అదే. 1994 ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగుపెట్టిన తాలిబాన్లు 1996 లో అక్కడి పాలకుల్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి.. వారి అరాచకాలతో ప్రపంచాన్ని వణికించారు.  చిన్నా చితకా విగ్రహాలే కాదు.. బమియాన్ వంటి అతిభారీ బుద్ధ విగ్రహాలను శక్తిమంతమైన మందుపాతర్లు, రాకెట్ లాంచర్లు పెట్టి కూల్చేశారు. యునెస్కో వారసత్వ హోదా ఉన్న అనేక గొప్పగొప్ప కట్టడాలను నేలమట్టం చేశారు. ఇక ఆఫ్ఘనిస్థాన్లో గంజాయి అక్రమ వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న శీతల అటవీప్రాంతాలే గంజాయి సాగుకు కేంద్రాలు. అదే వారికి వస్తు మారకానికి, తాలిబాన్ల విలాసాలకు, ఆఫ్ఘన్లోని ధనవంతులైన కుటుంబాలకు ఆదాయం సమకూర్చే వస్తువు. ఏటా నాలుగు బిలియన్ డాలర్ల గంజాయి వ్యాపారం జరుగుతుందని అంచనా. 

ఇక పరిపాలన విషయానికొస్తే వారి టార్గెట్ అంతా మహిళలు, చిన్నపిల్లలే కావడం గమనించాలి. ఈ విషయమే ఆధునిక ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. మొదటిసారి పవర్లోకి వచ్చిన తాలిబాన్లు మహిళల డ్రెస్ కోడ్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్టే ఈసారి కూడా వచ్చీ రావడంతోనే మహిళల డ్రెస్ కోడ్ మీదనే పడ్డారు. ఇంకా కాబూల్ కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఓ మహిళ టైట్ గా డ్రెస్ వేసుకుందని భారీ కత్తితో నడిబజారులో అందరూ చూస్తుండగానే నరికేశారు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. వాటిని తలుచుకునే ప్రజలంతా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. బయటకు రావడానికి జంకుతున్నారు. భవంతుల్లో ఉంటే ఎక్కడ పేలుస్తారోనని ధనవంతులు సైతం ఆరుబయటకొచ్చి తాలిబాన్లకు కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఎలా చెలరేగిపోతారో ఊహించుకొని భయపడుతూ.. అక్కడ బతకలేనివారు చాలా వేగంగా పట్టణాలు విడిచిపోతున్నారు. రాజధాని కాబూల్ లో ఇప్పుడంతా ఎటు చూసినా గడ్డాలు పెంచుకొని, సంప్రదాయ ఇస్లామిక్ దుస్తుల్లో ఆయుధాలు ధరించిన జిహాదీలే కనిపిస్తున్నారు. 

తాలిబాన్ల పాలనలో స్కూళ్లు, కాలేజీలు నడవవు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. ఆడపిల్లలు సైతం చదువుకోవడానికి అవకాశం లేదు. పదేళ్లు దాటిన అమ్మాయిలు బుద్ధిగా ఇంటిపట్టునే ఉండాలి. ఆ వయసు దాటినవారు మగతోడు లేకుండా బయటికి రారాదు. ఒకవేళ వస్తే కఠిన దండన తప్పదు. అలా వచ్చినా కూడా తల నుంచి కాలి బొటనవేలు వరకు పూర్తిగా కవరయ్యేలా వస్త్రధారణ ఉండాలి. అంతేకాదు.. శరీర సౌష్టవం కూడా తెలిసేలా బిగుతైన కాస్ట్యూమ్స్ వాడరాదు. ఇవన్నీ పాటిస్తేనే తాలిబాన్ల రాజ్యంలో బతికే వీలుంది. ఇక రేపోమాపో విపరీతమైన ఆంక్షల నడుమ తాలిబాన్ల పాలన మొదలవుతుంది. 

1996లో తొలిసారి ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లను 2001లో అమెరికా ఆధ్వర్యంలోని నాటో సైన్యాలు తరిమేశాయి. ఇప్పుడు పాతికేళ్ల తరువాత అమెరికా సైన్యం వెనక్కి మళ్లడంతో మరోసారి ఆటవిక రాజ్యానికి తెర లేచింది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.