పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ అరెస్ట్.. ఇదేం రాజ్యమని చంద్రబాబు ఫైర్ 

Publish Date:Aug 16, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి అరాచక పాలన సాగుతుందో మరోసారి రుజువైంది. దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య నివాసం దగ్గర పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ తో పాటు దూళిపాళ నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర, నక్కా ఆనంద్ బాబులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. లోకేశ్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు. 

మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. గుంటూరులోని కాకాని రోడ్డులో ఆదివారం ఈ దారుణం సంభవించింది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. రమ్య మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.

నారా లోకేష్ రావడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.  రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. రమ్య ఇంటి వద్ద చిత్రీకరణకు వెళ్లిన టీవీ5 టీవీ5 కెమెరాను లాగి పడేశారు. పోలీసుల దాడితో టీవీ5 కెమెరా  నుజ్జునుజ్జైంది. కెమెరాను లాక్కొని నేలకేసి కొట్టారు పోలీసులు. మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల తీరుపై  మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. 

నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించానని, వాళ్లతో మాట్లాడానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలు  అవసరం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని వాళ్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే వైసీపీ రౌడీలు వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారంటే.. గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై పోలీసుల దౌర్జన్యం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. రమ్య కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై కాదు సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవడంలో జగన్ ప్రతాపం చూపించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య జరగిందంటే.. మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని విమర్శించారు. గుంటూరులోనే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే ప్రభుత్వం పాలన ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. . టీడీపీ నేతలపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్లిన లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్ర లపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్యగావించబడుతుంటే దిశ యాప్ ఏం చేస్తుంది? సిసి కెమెరాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. 
 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.