సంజు శాంసన్ సంపద చూస్తే షాక్ అవుతారు!

Publish Date:Mar 14, 2026

Advertisement

 

టీ20 వరల్డ్ కప్‌లో తన ప్రతిభతో అభిమానులను అలరిస్తున్న భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైదానంలో సిక్సర్లు కొట్టే సంజు, ఆఫ్‌ ది ఫీల్డ్‌లో కూడా భారీ ఆస్తులను సంపాదించినట్లు సమాచారం. 2026 నాటికి సంజూ శాంసన్ నెట్‌వర్త్ సుమారు రూ.100 కోట్లకు చేరినట్లు అంచనా. క్రికెట్‌తో పాటు తెలివైన పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఆయన ఆదాయం గణనీయంగా పెరిగింది.

సంజు శాంసన్ తన భార్య చారులతతో కలిసి కేరళలోని త్రివేండ్రంలో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. సుమారు రూ.6 కోట్ల విలువైన ఈ ఇల్లు కేరళ సంప్రదాయ నిర్మాణ శైలి, ఆధునిక ఇంటీరియర్ డిజైన్ కలయికతో నిర్మించబడింది. ఇందులో ఆధునిక జిమ్‌, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇదే కాకుండా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా ఆయనకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

సంజు శాంసన్ సంపాదన 

బీసీసీఐ గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ద్వారా సంజూ ఏడాదికి రూ.1 కోటి సంపాదిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.3 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు ఫీజుగా అందుకుంటున్నారు. 2026 నాటికి సంజూ శాంసన్ మొత్తం నెట్ వర్త్ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ కప్‌లో  ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకోవడంతో ఆయన బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగింది. ప్రైజ్ మనీతో పాటు, రాబోయే రోజుల్లో ప్రముఖ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల ఆయన సంపద మరింత పెరిగే అవకాశం ఉంది.

సంజు శాంసన్ కెరీర్‌లో 2025–2026 సీజన్లు అత్యంత కీలకం. 2025లో రాజస్థాన్ రాయల్స్ ఆయనను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకోగా, 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే మొత్తానికి ఆయనను సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభంలో రూ.10 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన ఆయన ప్రయాణం, నేడు వందల కోట్ల ఆదాయానికి చేరుకుంది. సంజు శాంసన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన తొలి భారతీయ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, 2026 టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి ఈ ఘనత సాధించిన కొద్దిమంది భారతీయ ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించారు.

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.