కేథరిన్ డెలివరీ.. పండంటి అబ్బాయి..
Publish Date:Mar 19, 2015
Advertisement
ప్రముఖ హీరోయిన్ కేథరిన్ టైడెస్లీ డెలివరీ అయింది. పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ పసికందు కూడా కేథరిన్ మాదిరిగానే ముద్దుగా వున్నాడని తెలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ టామ్ పిట్‌ఫీల్డ్‌తో కేథరిన్ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘ది క్యారీ’ సినిమాలో నటించడం ద్వారా కేథరిన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టామ్‌తో డేటింగ్ చేస్తోన్న కేథరిన్ ‘పెళ్ళి’ లాంటి వ్యవహారాల్లో ఇరుక్కోకుండానే ఎంచక్కా పిల్లాణ్ణి కనేసింది. తాను డెలివరీ అయిన అనంతరం ఆమె స్వయంగా ట్విట్లర్లో ఆ విషయాన్ని ప్రకటించింది. ‘మేమిద్దరం కన్న కలలు నిజమయ్యాయి.’ అని ట్విట్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/coronation-street-actress-catherine-tyldesley-32-44253.html
http://www.teluguone.com/news/content/coronation-street-actress-catherine-tyldesley-32-44253.html





