టీటీడీని భ్రష్టుపట్టిస్తున్నది ఎవరు?.. తొక్కిసలాటపై సంచలన ఆరోపణలు..
Publish Date:Apr 14, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్’లో జరుగుతున్న పరిణామాలు, ఏడుకొండల చుట్టూ అల్లుకుంటున్న కుట్రలు, సామాన్య భక్తులకు వెంకన్న దేవుని దూరం చేసేందుకు ప్రభుత్వం, పాలక మండలి ప్రయత్నిస్తున్నాయి అంటూ వస్తున్న విమర్శలను గమనిస్తే, అవే నిజం అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎప్పుడో ఒకప్పటికి, ఏడుకొండలపై ఏసు ప్రభువు గీతాలు వినిపించక పోవని, వెంకన్న భక్తులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారం మళ్ళీ మరోమారు తెర మీదకు వచ్చింది. సర్వదర్శనం టోకెన్ల పంపిణి కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు గాయాలపాలైన దుర్ఘటనపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల సరిహద్దులను దాటి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జాతీయా మీడియా కూడా చర్చలు జరుపుతోంది. సందేహాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైందవ పీఠాధి పతులు, స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలనేకాదు, సామాన్య భక్తులను కూడా, ఏడు కొండల మీద ఏమి జరుగుతోంది? అనే ప్రశ్న ఆందోళనకు గురిచేస్తోంది. అంతే కాదు, గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన ఐవీఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి ఐఏఎస్ అధికారులు కూడా టీటీడీలో జరగరానిది ఏదో జరుగుతోందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. గతంలో టీటీడీ ఈఓగానే కాకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా, టీటీడీ వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యమత సంస్థలకు ప్రభుత్వ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరెక్కడా లేని విధంగా, జగన్ రెడ్డి ప్రభుత్వం పాస్టర్ల’కు నెలనెలా ఐదువేల రూపాయల వంతున చెల్లిస్తోంది. చర్చిల నిర్మాణానికి, మరమత్తులకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తోంది. ఇలాంటి ‘దాతృత్వ’ చర్యల ద్వారా జగన్ రెడ్డి ప్రభుత్వం అన్యమత ప్రచారానికి పెద్ద పీట వేస్తోందనే అభిప్రాయం వినవస్తోంది. హిందువులు ప్రభుత్వ వివక్షకు గురవుతున్నారు. అంతే కాదు, అన్యమత సంస్థలు ‘ప్రభుత్వం మాది’ అనే ధీమాతో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ నేపధ్యంలో తిరుపతి టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి, టోకెన్ విధానం ప్రవేశ పెట్టడమే ఓ పెద్ద తప్పు, ఈ మాట అన్నది మరెవరో కాదు సుదీర్ఘ కాలం పాటు టీటీడీ ఈఓగా, ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవీఆర్ కృష్ణా రావు. తిరుమలలో సామాన్య భక్తుల తొక్కిసలాట, అనంతర పరిణామాలపై ట్వీటర్’ వేదికగా స్పందించిన ఆయన, సర్వదర్శనం భావననే టోకెన్ విధానం దెబ్బతీసిందని అన్నారు. ఎలాంటి అడ్డంకులు అవరోదాలు లేకుండ ఏడుకొండలు ఎక్కిన ప్రతి భక్తుడు, సర్వ సదుపాయాలు ఉన్న క్యూ కాంప్లెక్స్’లో తమ వంతు వచ్చేవరకు వేచి ఉండి, దర్శనం చేసుకునే సదుపాయం కల్పించడమే సర్వదర్శనం భావన వెనక ఉన్న, అసలు ఉద్దేశమని పేర్కొనారు. 1980లలో, అప్పటి ఈఓ, పీవీఆర్’కే ప్రసాద్, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడమే కాకుండా, క్యూ కాంప్లెక్స్’లో భక్తుల కోసం చల్లని పానీయాలు, పిల్లల కోసం పాలు, ఆహారం అందుబాటులో ఉంచే చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశారని ఐవీఆర్ తమ ట్వీట్ ‘లో పేర్కొనారు. ఇప్పుడు అంత చక్కని వ్యవస్థను పాడు చేసి, ఈ టోకెన్ విధానం ఎందుకు తెచ్చారని, ఆయన ప్రశ్నించారు. అలాగే, కొత్తగా ఏదైనా సంస్కరణ తీసుకొస్తే, అది భక్తులకు మరింత సౌలభ్యం, వెసులు బాటు కల్పించేలా ఉండాలి కానీ, ఇలా కష్టాల పాలు చేసేలా ఉండరాదని అన్నారు. నిజం. అయితే, క్రైస్తవ ముఖ్యమంత్రి కనుసన్నులలో పనిచేసే ప్రస్తుత టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి అలాంటి సంస్కరణలను ఆశించడం మన అమాయకత్వమే అవుతుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి మత విశ్వాసాల విషయంలో చాలామందికి చాలా రకాల అనుమానాలున్నాయి. వైవీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాబాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ కుటుంబం. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి క్రైస్తవుడు అయినప్పుడు, ఆయన బాబాయి, హిందువు ఎట్లవుతరు? కొడుకు క్రిస్టియన్, బాబాయి హిందువు కావడమే కాదు, వైవీ సతీమణి ఇప్పటికీ క్రైస్తవ ఆచారాలు పాటిస్తారనే ఆరోపణలు, ఆ ఆరోపణలకు ఆధారంగా ఫోటోలో సోషల్ మీడియా వైరల్ అయిన సందర్భాలున్నాయి. అంటే’ భార్య క్రిస్టియన్ భర్త హిందువు. నిజమే, ఇవ్వన్నీ లేదా ఇందులో కొన్ని పూర్తి సత్యాలు కాకపోవచ్చును, కానీ, అసలు వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి మీద మక్కువ లేదు. వెంకన్న దేవునిపై నమ్మకం అయిన వుందో లేదో మనకు తెలియదు. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మణార్ధంగానే ఆయన ఆ పదివిలో కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు అంటారు. ఆయన మనసంతా ఎంపీ పదవి మీదనే వుంది. ప్రత్యక్ష రాజకీయాల చుట్టూనే ఆయన మనసు తిరుగుతూ ఉంటుందని అంటారు. ఇక టీటీడీ సభ్యుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అందుకే కావచ్చును తొక్కిసలాటఫై స్పందించిన టీటీడీ మాజీ ఈఓ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుత పాలకల మండలి భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోందన్నారు. తాకిడి ఎంతో ఎక్కువ ఉన్నా సమన్వయం చేసుకున్న చరిత్ర టీటీడీకి ఉందన్నారు. మరి ఇప్పుడు, ఏమైంది, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన బాబాయి టీటీడీ చైర్మన్ అయ్యారు. అంతకు మించి ఇకేమీ జరగ లేదు, ఆయినా వెంకన్న దేవుడు, ఏడు కొండలు నిత్యం వివాదంలోనే ఉంటున్నాయి. అందుకే, ఉద్దేశ పూర్వకంగానే ఇదంతా జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలక మండలి సభ్యుల వ్యవహారశైలిపైనా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆక్షేపణ వ్యక్తం చేశారు. అసలు టీటీడీలో 80 మంది సభ్యులు ఏమిటి? 80 మందిని పెట్టుకుని బోర్డు సమావేశం ఎలా జరపగలరని ఎల్వీ ప్రశ్నించారు. అందులోనూ అత్యధికులు రాజకీయ నేతలే ఉన్నారు. అందుకే టీటీడీ సమావేశాలు శాసనసభ సమావేశాలు జరిగినట్లుగా జరుగుతున్నాయని ఎల్వీ ప్రశ్నించారు. టీటీడీకి ప్రస్తుత ఈఓ జవహర్ రెడ్డి అయితే ఈయన పేరుకు మాత్రమే ఈఓ. పెత్తనమంతా జేఈఓ ధర్మారెడ్డిదే. అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు. ఈ ధర్మారెడ్డి మళ్ళీ వైఎస్ బందువు. అందుకే కావచ్చును ఈవో జవహర్ రెడ్డికి ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు అప్పగించారు. టీటీడీ ఈవోను అదనపు బాధ్యతగా అప్పగించిన వ్యవహారంపైనా ఎల్వీ విమర్శలు గుప్పించారు. టీటీడీ ఈవో 24 గంటలూ పనిచేసినా సమయం సరిపోదని, అలాంటిది అదనపు బాధ్యతలుగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నిజమే, వైఎస్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఏడు కొండలను రెండు కొండలకు కుదించే కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పడు జగన్ రెడ్డి ఏకంగా ఏడు కొండలను, గుడిని గుడిలో లింగాన్ని, మింగే ప్రయత్నం చేస్తున్నారా, అనే సందేహాలు సామాన్య భక్తులు వ్యక్త పరుస్తున్నారు. ఇదాలా ఉంటే జేఈఓ ధర్మారెడ్డి చాలా కాలంగా టీటీడీలో పాతుకు పోయారు. నిజానికి ఆయన స్టేట్ క్యాడర్ ఐఏఎస్ అధికారి కాదు. అయినా, రెండు మూడు సార్లు డిపుటేషన్’ మీద రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన ప్రతి సారీ, ఆయన టీటీడీలోనే వివిధ స్థాయిల్లో పని చేస్తూ వచ్చారు. ప్రస్తుత డిపుటేషన్’ వచ్చే నెల (మే) సెకండ్ వీక్ లో ముగుస్తుంది. అయితే, మళ్ళీ ఆయన డిపుటేషన్’ పొడిగించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మళ్ళీ ఆయనే టీటీడీలో చక్రం తిప్పడం, జగన్ రెడ్డి అజెండాను మరింత ముందుకు తీసుకుపోవడం ఖాయమని అంటున్నారు.
ఒక్క తిరుమలలోనే కాదు, ఏపీలోనే హైందవ ధర్మానికి విఘాతం కల్పించే పరిస్థితులు ఏర్పడ్డాయని, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. అంటే పరిస్థితి ఎటు పోతోందో వేరే చెప్పనక్కరలేదు. టీటీడీ సహా రాష్ట్రంలోని హిందూ దేవాలయాలో పనిచేస్తున్న, హిందువేతర సిబ్బందిని గుర్తించి, తొలిగించే ప్రయత్నం ప్రారంభించినందుకే, ఎల్వీని రాత్రికి రాత్రి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బదిలీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి, కృతజ్ఞలు తెలియచేశారు. సంబురాలు చేసుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్న వైనమే కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/controversy-over-ttd-39-134399.html





