దేవాలయాల్లో వరస దుర్ఘటనల వెనక కుట్ర కోణం?

Publish Date:May 6, 2025

Advertisement

వారం రోజుల కిందట ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.  అంతకు ముందు రోజు రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.  ఆ తర్వాత మూడు రోజులకు మే 3న గోవాలో మరో ఘోర విషాదం జరిగింది. శిర్గావ్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు. 

వివరాలలోకి వెళితే..  శిర్గావ్ లోని శ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర అదే రోజు ప్రారంభమైంది. దీంతో లైరాయ్‌ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న 'నిప్పులపై నడిచే' కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు.

ఆ తర్వాత సోమవారం(మే 5) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో నెలకొన్ని ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం చెలరేగింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటరు వరకూ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్‌కు పైనున్న రూఫ్‌ వద్ద మంటలు చెలరేగగా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
 ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు సంఘటనలు (ఇంకా మన దృష్టికి రానివి ఉన్నా ఉండవచ్చు) వేటికవిగా చూస్తే, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు, కానీ, ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ సంఘటనల పూర్వపరాలను, సమయ సందర్భాలను గమనిస్తే ఎంతో కొంత అనుమానాలకు ఆస్కారం లేక పోలేదని అంటున్నారు. 

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ  దేవాలయలాపై జరిగిన దాడులు, ఆ సందర్భంగా అప్పటి మంత్రులు స్పందించిన తీరును గుర్తుచేసుకుంటే, అవే కుట్రలు ఇప్పటికీ కోనసాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు,అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరపతి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ఆ పార్టీ, ఆపార్టీ ప్రచార మాధ్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా జరిగిన  తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ దుర్ఘటన విషయంలో వైసీపీ స్పందించిన తీరు అనుమానాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉందని అప్పట్లోనే ఆరోపణలు వినవచ్చాయి. ఇక గత నెల (ఏప్రిల్)లో వైసేపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో ఏకంగా 100 కి పైగా ఆవులు నిర్వహణ లోపం కారణంగా చనిపోయాయని ఆరోపించారు.అంతే కాదు  తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగరాని ఘోరాలన్నీ జరిగిపోతున్నాయని భక్తులను తప్పు తోవట్టించేందుకు  భూమన, జగన్ ఇతర వైసీపీ నాయకులు సొంత మీడియాను వేదిక చేసుకుని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు. 

నిజానికి..  వైసీపీ అధినేత జగన్ రెడ్డి హిందూ వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్యమతస్థులు, వెంకన్న దేవుని పై విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక రిజిస్టర్  లో సంతకం చేయాలన్న నిబంధన ఎప్పటి నుంచో వుంది. మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎందరో పెద్దలు   దేవాలయ మర్యాదను పాటించారు. కానీ, జగన్ రెడ్డి మాత్రం ఏనాడు తమ విశ్వాసాన్ని ప్రకటించలేదు  సరి కదా, ఆ నిబంధనే తప్పని పరోక్షంగానే అయినా ఆయనేమి దేవుడు అనే అర్థం వచ్చేలా  వెంకన్న స్వామినే  నిందించారు.

ఈ పరిణామాలను గమనిస్తే తిరుమల సహా రాష్ట్రంలో, దేశంలో ఉన్న హిందూ దేవాలయాల పవిత్రతను, హిందువుల విశ్వాసాని దెబ్బ తీసేందుకు నిరంతర కుట్రలు జరుగుతున్నాయా?  అంటే మొన్న తిరుపతిలో, నిన్న సింహాచలంలో, ఆ వెంట గోవా, ఉజ్జయిని (ఎంపీ) లో జరిగిన సంఘటనలు గమనిస్తే.. కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.