తెదేపాకు వరంగా మారిన కాంగ్రెస్ వ్యూహం

Publish Date:Feb 21, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన వ్యవహారంలో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు నుండే నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది. అందుకోసం మరో సరికొత్త వ్యూహం రచించింది. ఈ వ్యూహంలో భాగంగా 1. సీమాంధ్ర నేతల ఒత్తిడి కారణంగానే భారీ ప్యాకేజి ఇచ్చేందుకు అంగీకరించడం. 2.తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం చేయడం.

 

సీమాంధ్ర ప్రజలకు ప్యాకేజీ తాయిలాలు ప్రకటించి, ‘గుడ్డిలో మెల్ల అన్నట్లు చివరికి కనీసం ఆమాత్రమయినా దక్కిందని’ వారే స్వయంగా భావించేలా చేసి తనపై ఏర్పడిన వ్యతిరేఖతను తెదేపా, వైకాపాలపైకి మళ్ళించడం ఈ వ్యూహం.

 

అందుకే ఇంత కాలంగా ఈ విభజన వ్యవహారంలో ఎన్నడూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధుల గోడు పట్టించుకోకుండా వారిని చాలా హీనంగా చూసిన కాంగ్రెస్ అధిష్టానం, సరిగ్గా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందు అకస్మాత్తుగా వారి మీద ప్రేమ ఒలకబోస్తూ వారితో సమావేశమై “కేవలం వారి ఒత్తిడి కారణంగానే” సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వగైరా తాయిలాలు ఇస్తున్నట్లు ప్రకటించి చాలా సమయ స్ఫూర్తి, లౌక్యం ప్రదర్శించి ఆఖరు నిమిషంలో వారిని పూర్తిగా కట్టడి చేసింది.

 

సోనియా, రాహుల్ గాంధీలు చాలా దయతో సీమాంధ్రకు ప్యాకేజీలు విదిలించినందుకు కేంద్ర మంత్రి జేడీ.శీలం మీడియా ముందుకొచ్చి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా. మన సమస్యతో ఎటువంటి సంబంధమూ లేని పశ్చిమ బెంగాల్ కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మన రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సభలో ఆందోళన చేస్తుంటే, ఆయన ఈ వ్యవహారంతో అసలు తనకేమీ సంబంధమూ లేనట్లుగా నిసిగ్గుగా చూస్తూ కూర్చొన్నారు.

 

ఇక ‘సమైక్యాంధ్ర’ అంటూ గర్జించి తన పదవికి (ఒట్టొట్టి) రాజీనామా కూడా చేసిన మరో కాంగ్రెస్ జీవి చిరంజీవి, మొన్న సభలో ఏవిధంగా ‘మ్యావ్ మ్యావ్’ అన్నారో ప్రజలందరూ చూసారు. ఆ జీవి తన అధిష్టానం అమలుచేయబోయే వ్యూహంలో రెండో భాగానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర విభజన కేవలం తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని సభలోనే తేల్చి చెప్పారు.

 

కాంగ్రెస్ అధిష్టానం రచించిన ఈ వ్యూహాన్ని ఇప్పుడు బొత్స, అనం, డొక్కా, రఘువీర వంటి వీర విదేయులందరూ భుజాలకెత్తుకొని సీమాంధ్రలో పార్టీని బ్రతికించుకొంటామని శపధాలు చేసి ప్రజలలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చిందని టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో చాటింపు వేసుకొని ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు కేవలం తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన లేఖల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదని చెప్పుకొంటూ, ప్రజలలో తమపై, తమ కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేఖతను తెలివిగా ఆ రెండు పార్టీల మీదకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు.

 

తమ పార్టీయే రాష్ట్ర విభజన చేసినప్పటికీ ఆవిషయాన్నిదాచిపెట్టి కేవలం తామే సీమంధ్రకు భారీ ప్యాకేజీలు ఇప్పించామని ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బహుశః ఇక నుండి వారందరూ ఈ ప్యాకేజీల వలన సీమాంధ్ర ఎంత లాభపడిపోతుందో, రాత్రికి రాత్రే ఎంతగా అభివృద్ధి చెందుతుందో కధలు కధలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టవచ్చును. ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ఇది గ్రహించలేని మూర్కులని కాంగ్రెస్ పార్టీ భావించడం చాలా విచిత్రమే.

 

అయితే, సీమాంధ్రలో నష్ట నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ అస్త్రాన్ని తెదేపా, వైకాపాల మీదకు ప్రయోగించిందో సరిగ్గా అదే అస్త్రం వారికి తెలంగాణాలో మళ్ళీ పుంజుకోనేందుకు గొప్ప ఆయుధంగా అందివచ్చింది.  తెలంగాణా ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే స్వయంగా "కేవలం తెలుగుదేశం లేఖ కారణంగానే" తెలంగాణా ఇచ్చామని చెప్పుకోవడంతో ఈ విభజన అంశం కారణంగా తెలంగాణాలో డీలా పడిపోయిన తేదేపాకు అదొక ఊహించని వరంగా మారింది. అందువల్ల ఇప్పుడు తెదేపా-తెలంగాణా నేతలు కాంగ్రెస్ చెపుతున్న ఈ మాటలనే అందిపుచ్చుకొని, కేవలం తెలుగుదేశం పార్టీ వలననే తెలంగాణా రాష్ట్రం సాధ్యమయిందని దైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకొనేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణాకు అనుకూలమంటూ లేఖ ఇచ్చి తెదేపా వెనక్కి తగ్గిందని తెరాస చేసిన విమర్శలు కూడా తెదేపా వాదనను బలపరిచేవిగా ఉన్నాయి.

 

అందుకే చంద్రబాబు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ  నిన్నమీడియా ముందుకు వచ్చి “తమ పార్టీ తెలంగాణాకు అనుకూలమని ఇచ్చిన లేఖను నేటికీ వెనక్కి తీసుకోలేదని, తాము రాష్ట్ర విభజన చేస్తున్న తీరుని వ్యతిరేఖించామే తప్ప, తెలంగాణాను కాదని" చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ప్యాకేజీపై బొత్స సత్యనారాయణే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినందున, చంద్రబాబు కూడా అదే విషయం ప్రస్తావిస్తూ "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమంటే ఏదో ఒక భవనం కట్టినంత తేలిక కాదు. ఆ సంగతి ఆ పార్టీ నేతలకీ తెలుసు. అది విదిలించే ప్యాకేజీ రాష్ట్రం అప్పులు తీర్చుకోవడానికి కూడా సరిపోవని" కాంగ్రెస్ వ్యూహాన్ని ఎండగట్టారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.