ప్రాంతాల మధ్య చిచ్చు.. జగన్ కొత్త వ్యూహం.. విశాఖ నుంచే ప్రమాణం ప్రకటన అందుకేనా?

Publish Date:Mar 6, 2024

Advertisement

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తోంది. వీరి క‌ల‌యిక స‌క్సెస్ కావ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేస్తూ.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వైసీపీ కోవ‌ర్టులు, కాపు సంఘం పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాల‌ను సైతం ప‌వ‌న్‌, చంద్ర‌బాబు చాలా చాలా బలంగా తిప్పికొట్టారు. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లమ‌వ్వడంతో ఓట‌మి ఖాయ‌మ‌ని జ‌గ‌న్ సహా వైసీపీ పెద్ద‌ల‌కు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది.  

జ‌గ‌న్ సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ మ‌ళ్లీ అధికారం  అసాధ్య‌మ‌ని తేలిపోయింది. దీంతో జ‌గ‌న్ కొత్త నాట‌కానికి తెర‌లేపారు. ప్రాంతాల వారిగా వైసీపీ బ‌లాబ‌లాల‌ను విశ్లేషించుకున్న జ‌గ‌న్‌  పోలింగ్ స‌మ‌యం నాటికి విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే అంశాన్ని ప్ర‌జ‌ల్లో రెచ్చ‌గొట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోని విశాఖ రాజ‌ధాని అంశాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చారు. అంతేకాదు.. తాను మళ్లీ  అధికారంలోకి వ‌స్తే విశాఖ నుంచే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని విశాఖ వేదిక‌గా చెప్పారు. దీని ద్వారా విశాఖప‌ట్ట‌ణంతోపాటు చుట్టు ప‌క్క‌ల జిల్లాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. 

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఉపాధిలేక హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్తున్న ప‌రిస్థితి. దీంతో గ‌తం ఎన్నికల్లో ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్ర‌జ‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌తో పాటు.. అగ్నికి అజ్యం తోడైనట్లు  తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తుగా ఎన్నిక‌లో బ‌రిలోకి దిగుతుండ‌టం, మ‌రోవైపు కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సైతం రాష్ట్రంలో తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో క‌లిసినడిచేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో జ‌గ‌న్ లో  ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. భారీ స్థాయిలో ఓట‌మిని చ‌విచూడ‌కుండా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ రాజ‌ధాని అంశాన్ని ఉన్న‌ట్లుండి తెర‌పైకి తెచ్చార‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

ఏపీని రాజ‌కీయంగా మూడు ప్రాంతాలుగా తీసుకుంటే.. సౌత్ కోస్ట‌ల్ ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలు, నార్త్ కోస్ట‌ల్ ఆంధ్రా విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాళం ఉమ్మ‌డి జిల్లాలు.. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలో ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూల్ ఉమ్మ‌డి జిల్లాలు ఉంటాయి. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల అంచ‌నా ప్ర‌కారం.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ  వైఖ‌రితో గుంటూరు, కృష్ణా ఉమ్మ‌డి జిల్లాల ప్ర‌జ‌లు జగన్ అన్నా జగన్ పార్టీ అన్నా మండిపడుతున్నారు.  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో ఈ రెండు ఉమ్మ‌డి జిల్లాల‌కు తోడు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ కూట‌మిదే  తిరుగులేని ఆధిపత్యం అని సర్వేలు సందేహాలకతీతంగా తేల్చేశాయి.  రాయ‌ల‌సీమలోని ఉమ్మ‌డి జిల్లాల్లో ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే, ఆ జిల్లాలలో తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి.  ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోనూ తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నది. సొంత సర్వేలే పార్టీ గెలిచే అవకాశాలు లేవని తేల్చేయడంతో  జగన్ వ్యూహాత్మ‌కంగానే విశాఖ, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం ప్రాంతాల‌పై దృష్టిసారించారు.  అందుకే మరోసారి విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అమ‌రావ‌తి రాజధాని విష‌యంలో పార్టీ స్టాండ్ ప్ర‌కారం, మ‌రోవైపు   తెలుగుదేశం, జనసేన పొత్తు కార‌ణంగా ఎన్నిప్ర‌య‌త్నాలు చేసినా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అద‌నంగా వ‌చ్చే ఓటు బ్యాంకు ఏమీ ఉండ‌ద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రాయ‌ల‌సీమ‌పై వైసీపీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టిసారించింది. ఆ ప్రాంతంలో గ‌తంకంటే సీట్లు త‌గ్గినా మెజార్టీ సీట్లు సాధించేలా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక విశాఖ, దాని ప‌రిధిలోని జిల్లాల్లో ప‌ట్టు సాధించేందుకు సీఎం జ‌గ‌న్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. విశాఖ రాజ‌ధాని అని మొద‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్నా ఆ ప్రాంత ప్ర‌జ‌లు అంత‌గా స్పందించ‌డం లేదు. స్పందన ఏంటి అసలు జగన్ మాట నమ్మడం లేదు. విశాఖ నుంచే పాలన అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి మిన్నకుండటంతో జగన్ మాటల మీద ఉత్తరాంధ్ర జనాలకు నమ్మకం పోయింది.  దీంతో జగన్ ఇప్పుడు విశాఖ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అనే నినాదాన్ని తెర‌పైకి తెచ్చి రెండు ప్రాంతాల ప్ర‌జ‌ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వ్యూహానికి తెరతీశారు.  త‌ద్వారా విశాఖ‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లోని జిల్లాల్లో  ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌వచ్చని భావిస్తున్నారు. ఎటూ రాయలసీమలో తనకున్న పట్టు ద్వారా అధిక స్థానాలు సొంతం చేసుకోలనన్న నమ్మకం జగన్ లో ఉంది.  జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంత‌కైనా తెగిస్తార‌నేది ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌య‌మే. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రెండు ప్రాంతాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించి ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగానే జ‌గ‌న్ ఉన్న‌ట్లుంటి విశాఖ‌నే ఏపీ రాజ‌ధాని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇక్క‌డే ప్ర‌మాణ స్వీకారం చేస్తా అంటూ వ్యాఖ్యానించాడ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.