కేంద్రంలో అధికారం ఎవరిది? దక్షిణాది రాష్ట్రాల తీర్పే కీలకం!

Publish Date:Mar 6, 2024

Advertisement

సార్వత్రిక ఎన్నికలలో  దక్షిణాదికి ఇప్పటి వరకూ పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ లోక్ సభలో అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా అవతరించి దాదాపుగా విపక్ష పాత్ర పోషించింది. అయితే అప్పుడు ఉన్నది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత అవి రెండు రాష్ట్రాల మధ్యా విడిపోయాయి. తెలంగాణలో 17, ఏపీలో పాతిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ చాలా వరకూ ప్రాంతీయ పార్టీల హవా ఉండటంతో సార్వత్రిక ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ఈ సారి అలా కాదు... ఉత్తరాదిన కాంగ్రెస్ బలహీన పడటం, అదే సమయంలో దక్షిణాదిన పుంజుకుంటూ వస్తున్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ సాధిస్తున్న పట్టును దెబ్బతీయడం ప్రధాన టార్గెట్ గా మారింది. అదే సమయంలో దక్షిణాదిలో పార్టీ బలహీనతను దక్షిణాదిలో అత్యధిక స్థానాలలో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకుని కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి భాగస్వామ్య పక్షాలను ఆకర్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందన్నదానిపైనే కేంద్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

అందుకే  తనకు పట్టు ఉన్న దక్షిణాదిపై  సహజంగానే కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తే.. కాంగ్రెస్ ముక్త భారత్ ను సాకారం చేయలేకపోయినా.. దక్షిణాదిలో ఆ పార్టీ మరింత బలోపేతం కాకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ కూడా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీకి కర్నాటకను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్టేక్ లేదు. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేంద్ర పాలత ప్రాంతం పుదుచ్చేరిలలో ఆ పార్టీ ఉనికి, ఓటు కూడా నామమాత్రమే. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏదో మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా.. అధికారంలోకి వచ్చేంత బలం కానీ  ఓటు కానీ ఆ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాలలో పొత్తుల ద్వారా ఏవో కొన్ని స్థానాలకు పరిమితమౌతూ వచ్చింది. అటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి పోరు ద్వారా చెప్పుకోదగ్గ లోక్ సభ స్థానాలను గెలుచుకోగలమన్న ధీమాతో ఉంది. తమిళనాడులో కూడా జయలలిత మరణం తరువాత  చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో అక్కడ కొద్ది మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా, సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ను చూసిన తరువాతే అక్కడ కమల వికాసం ఏలా ఉందో చెప్పగలం.

ఇక ఏపీలో  బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సొంతంగా బలోపేతం అవ్వడం సంగతి అటుంచి పొత్తు కుదుర్చుకున్నా భాగస్వామ్య పార్టీల నుంచి ఓటు ట్రాన్స్ ఫర్ అవ్వడం అనుమానమేనని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఇక కేరళలో ఇప్పటికీ వామపక్ష ఆధిపత్యమే కొనసాగుతోంది.     దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్నాటక మాత్రమే. ఆ రాష్ట్రంలో మాత్రమే బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకోగలనన్న విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కు దక్షిణాదిలో పెరుగుతున్న పట్టుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా  బీజేపీ  ప్రత్యేక దృష్టి సారించడంతో  ఈసారి సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందరి దృష్టీ ఈ రాష్ట్రాలపైకి మళ్లింది.  ప్రతి రాష్ట్రం నుంచీ లోక్ సభలో కనీస ప్రాతినిథ్యం అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి దక్షిణాది ఓటర్లు ఏం తీర్పు ఇస్తారన్నది వేచి చూడాల్సిందే. 

By
en-us Political News

  
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.