Publish Date:Oct 21, 2026
కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనకు విరామం ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇందుకు సంబంధించి స్వయంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు, మద్దతుదారులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ రాజీనామా సహా పలు ప్రజా సమస్యలపై రాజధాని ఢిల్లీలో సీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసుల అణచివేత కారణంగా పలువురు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కార్యకర్తల కుటుంబాలపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయనీ, అందుకే కార్యకర్తలు, నాయకులు పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ఈ తాత్కాలిక విరామ నిర్ణయం తీసుకున్నట్లు అభిజీత్ దీప్కె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ప్రముఖ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టులు, జ్యుడీషియల్ కస్టడీ గురించి అభిజీత్ దిప్కే ప్రస్తావించారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జైలులో గడిపినప్పటికీ వారి మొహంలో ఎలాంటి భయం కనిపించలేదని, వారి ధైర్యసాహసాలు పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని కొనియాడిన ఆయన చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తామన్నారు.
[Cockroach Janata Party Gives Break Agitation, Diwali Protest Pause, CJP Agitations, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cockroach-janata-party-gives-break-agitation-39-234921.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.