జగన్ ఏమైనా గజినీయా: మెమరీ లాస్ అయ్యిందా? ఎన్నికల హింసపై సుద్దులెందుకు.?

Publish Date:Oct 20, 2026

Advertisement

రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం పోయాక మరో మాట వినిపించడం కొత్తేమీ కాదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడే నాయకులు   వైఖరిని మరచిపోయి మాట్లాడటం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చుట్టూ సాగుతున్న వివాదం.. ఈ వివాదం విషయంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై రాజకీయవర్గాలలోనూ, నెట్టింటా కడా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. 

స్థానిక నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారనీ, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం..  అన్నది ఆధారాలు, అధికారిక విచారణ తేలుస్తుంది. అ విషయం పక్కన పెడితే.. జగన్ గతంలో అంటే ఆయన అధికారంలో ఉండగా ఎన్నికల వ్యవస్థలతో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

అరాచకాలు జరిగాయని జగన్ చెప్పడాన్నితప్పుపట్టడం లేదు కానీ, జగన్   అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన విమర్శలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన చేస్తున్న ఫిర్యాదులకు ఒకే కొలమానం వర్తిస్తుందా? ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేసే నాయకుడి మాటలకు విశ్వసనీయత రావాలంటే, గతంలోనూ అదే సూత్రాలకు కట్టుబడి ఉండాలి, లేదా ఉన్నట్లు కనిపించాలి.. కానీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చేస్తున్న విమర్శలు ఫిర్యాదులప పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. తనదాకా వస్తే కానీ.. అన్న సమేతను గుర్తు చేస్తున్నదని అంటున్నారు. 

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణుల్లో కనిపించని ఉత్సాహం. పార్టీ నాయకుల ఉదాశీనత.  మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులో ఉండటం కూడా వైసీపీలో పోటీకి ముందే పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేయడానికి ఒక కారణంగా పరీశీలకులు విశ్లేషిస్తున్నారు.  

2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి, తిరుపతి తదిత ప్రాంతాల్లో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.  నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, దాడులు జరిగాయని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మరోవైపు, కూటమి నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డంకులను ప్రస్తావిస్తూ ప్రతివిమర్శలు చేస్తున్నారు.  

 ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత, ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, నిష్పక్షపాత ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతున్న జగన్.. గతంలో అంటే తాను అధకారంలో ఉన్న సమయంలో అప్పటి   రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పట్ల వ్యవహరించిన తీరుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ, స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాలపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థల గౌరవం గురించి జగన్ మాట్లాడుతున్నప్పుడు, గతంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  

ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారు చెప్పిందే నిజమని అంగీకరించడం కాదు. ప్రతిపక్షం చెప్పిందే వాస్తవమని నమ్మడమూ కాదు. ఆధారాలు పరిశీలించి, న్యాయబద్ధమైన నిర్ణయాలకు కట్టుబడటం. జగన్ వ్యవస్థల గౌరవం గురించి మాట్లాడితే, గతంలో వాటితో జరిగిన వివాదాలపై ప్రశ్నలు రావడం సహజం. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తన పార్టీ శ్రేణుల ప్రవర్తనపైనా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే.

[AP Local Body Elections Violence, Jagan Mohan Reddy, Chandrababu Naidu, YCP, TDP,  Election Related Violence, Andhra Pradesh Politics, Telugu One]

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.