Publish Date:Jul 30, 2025
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.
Publish Date:Jul 30, 2025
కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా.. అబ్బే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.
Publish Date:Jul 30, 2025
సృష్టి కేసులో తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. డాక్టర్ నమ్రత జగత్ జంత్రీగా కనిపిస్తోంది. ఆమె ఇప్పటి వరకూ హైదరాబాద్ లో 30 సరోగసీ కేసులు హ్యాండిల్ చేయగా.. ఆమె బేబీ సెంటర్ కి సరోగసీ విషయంలో కనీసం పర్మిషన్లు లేవని తెలుస్తోంది.
Publish Date:Jul 30, 2025
జగన్ ప్రెస్ మీట్లకు.. ఈ మధ్య రాముడు మంచి బాలుడికి మల్లే వచ్చేస్తున్నారు. భల్లే భల్లే కబుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయన కబుర్లన్నీ పేపర్లూ, టీవీల్లో వచ్చేస్తాయి. కాదనడం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మరీ బుద్ధిమంతుడ్లా కనిపించడమేంటా? అన్నది ఒక అనుమానం. ప్రశ్న. చర్చ. వగైరా వగైరా.
Publish Date:Jul 30, 2025
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30) 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Publish Date:Jul 30, 2025
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
Publish Date:Jul 30, 2025
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
Publish Date:Jul 30, 2025
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు.
Publish Date:Jul 30, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెరిగింది. ఈ కుంభకోణంలో దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మును దాచిన ప్రదేశాన్ని గుర్తించిన సిట్.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.
Publish Date:Jul 29, 2025
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు.
Publish Date:Jul 29, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
Publish Date:Jul 29, 2025
యువతీ, యువకులు సెల్ఫీ మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Publish Date:Jul 29, 2025
రుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు.