political-news-img

ప్రపంచ సముద్ర రక్షణ కవచంగా ఇండియా.!

ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం భూ సరిహద్దుల కంటే సముద్ర మార్గాల భద్రతే కీలకమైన అంశంగా మారింది. గత కొన్నేళ్ళుగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమస్యలు, హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల పునరాగమనం వంటివి ప్రపంచ సరఫరా గొలుసును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రక్షణ, దౌత్య వర్గాల్లో భారత్ పాత్రపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రముఖ ఇజ్రాయెలీ పత్రిక ది జెరూసలేం పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇండియాను కేవలం ఒక పెద్ద మార్కెట్‌గా కాకుండా, ప్రపంచ భద్రత, సముద్ర వ్యాపార రక్షణకు అనివార్యమైన రక్షణ కవచంగా చూస్తున్నాయి. చారిత్రక పరిణామం కేవలం రక్షణ స్థాయి నుండి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ వరకూ ఇండియాకు సముద్ర ప్రయాణాలు, వాణిజ్యంతో శతాబ్దాల అనుబంధం ఉంది. చోళ సామ్రాజ్య కాలంలో భారత నౌకాబలం ఆగ్నేయాసియా వరకు విస్తరించిన చరిత్ర ఉంది. అయితే, స్వాతంత్ర్యం తర్వాత సంభవించిన సరిహద్దు యుద్ధాల వల్ల భారత్ సుదీర్ఘకాలం పాటు భూ సరిహద్దు రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. 1991 ఆర్థిక సంస్కరణలు మరియు 2008 ముంబై సముద్ర దాడుల తర్వాత వ్యూహాత్మక ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో యాంటీ పైరసీ ఆపరేషన్లను నిరంతరాయంగా నిర్వహిస్తూ, భారత నౌకాదళం వేలాది వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించింది. దీంతో ఒకప్పుడు తన సముద్ర తీరాన్ని మాత్రమే కాపాడుకునే స్థాయి నుండి, నేడు హిందూ మహాసముద్ర ప్రాంతం మొత్తానికి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా భారత్ అవతరించింది. ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌక.. స్వదేశీ తయారీలో ఇండియా పురోగతి భారత నేవీ బలోపేతం కావడం వెనుక అధునాతన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన స్వదేశీ నిర్మాణ వ్యూహం ఉన్నాయి. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వెల్లడించిన వివరాల మేరకు.. సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి రక్షణ దళంలో చేరుతోంది. ప్రస్తుతం నౌకాదళంలో 145కి పైగా నౌకలు సేవలందిస్తుండగా, మరో 52 నౌకలు మన దేశీయ షిప్‌యార్డులలోనే నిర్మాణంలో ఉన్నాయి. నౌకాదళ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం, 2030 నాటికి 155కి పైగా స్వదేశీ యుద్ధనౌకలను, 2035 నాటికి ఏకంగా 200 నౌకల భారీ నౌకాదళాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలువుతున్నాయి. గతంలో ఎర్ర సముద్రంలో సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ 30కి పైగా యుద్ధనౌకలను రంగంలోకి దించి, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రక్షణగా నిలవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ చట్టాలు, సముద్ర జలసంధుల రక్షణ, సముద్ర భద్రత , వాణిజ్య స్వేచ్ఛకు ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట ఒప్పందం కీలక పునాది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం జరిగే హార్ముజ్ జలసంధి, అలాగే బాబ్ ఎల్-మాండెబ్, మలక్కా జలసంధులు సజావుగా సాగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం. ఈ కీలక మార్గాలు మూతపడితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ స్తంభిస్తుంది. భారత్ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటూనే.. ఈ నౌకాయాన మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు తన సైనిక, దౌత్య సామర్థ్యాలను ఉపయోగిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా మలక్కా జలసంధిపై నిరంతర పర్యవేక్షణ పెంచడం భారత్ చేపట్టిన కీలక చర్యలలో ఒకటి. ఇండియా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల రక్షణ భాగస్వామ్యం ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో పశ్చిమ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు కేవలం ఆయుధ కొనుగోలు స్థాయిని దాటి, సంయుక్త పరిశోధనలు, ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ రాఫెల్, తన ప్రసిద్ధ ఐరన్ డోమ్ ఇంటర్‌సెప్టర్ పరిజ్ఞానానికి సంబంధించిన తయారీని భారత్‌లోనే చేపడుతుండటం వ్యూహాత్మక మార్పునకు అద్దం పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద జరుగుతున్న ఈ పరిణామాలు రక్షణ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాయి. ఆర్థిక రక్షణ, ఐఎమ్ఈసీ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఇండియా ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, ప్రధాన ఇంధన శుద్ధి కేంద్రంగా ఉంది. భారత్, గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం వందల బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో.. సముద్ర మార్గాల భద్రత భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ఈసీ) ద్వారా హార్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆసియా, గల్ఫ్, యూరప్‌లను సురక్షితమైన సముద్ర, రైలు మార్గాల ద్వారా అనుసంధానించేందుకు అడుగులు పడుతున్నాయి. గ్లోబల్ ఆర్డర్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త ఇండియా ఒకప్పుడు కేవలం భూ సరిహద్దు భద్రతకే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ మారిటైమ్ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తోంది. పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ ఇండియాతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపడం వెనుక భారత్ క్రమశిక్షణ, సముద్ర నౌకాదళ వేగం, రక్షణ విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని సురక్షితంగా నడిపించడంలో, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను కాపాడటంలో భారత్ పాత్ర కీలకం కానుంది. భవిష్యత్ పరిణామాలు, అంతర్జాతీయ దృష్టి ముందుముందు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే భౌగోళిక రాజకీయ మార్పులు భారత నౌకాదళ విస్తరణపై ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నౌకాదళాన్ని ఆధునీకరించడం, మిత్రదేశాలతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా సముద్ర భద్రతలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచ రక్షణ సమీకరణాలను పునర్నిర్వచిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి భారత్ కేవలం లబ్ధిదారుగా మాత్రమే కాకుండా, సంరక్షకుడిగా నిలుస్తోంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Indian Navy, India-Israel relations, maritime security, Indian Navy, strategic security

Publish Date: Jul 29, 2026 6:13PM

political-news-img

జోగి రమేష్ ఏ మాత్రం క్రెడిబులిటీ లేని వ్యక్తి.!

తెలుగువన్ ప్రత్యేకం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి, రాజధాని అమరావతిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై మైలవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వన్ న్యస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కుట్రలతో అమరావతిని చెడగొట్టాలని చూసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. గతంలో వైపీపీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వివరంగా వెల్లడించారు. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు తలెత్తడం వల్లే తాను బయటకు వచ్చి, తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. పారిశ్రామిక రంగానికి రావాల్సిన రాయితీలు, నిధుల విడుదల విషయంలో నాలుగేళ్లపాటు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తమకు కావలసిన కొందరికే నిధులు, రాయితీలు విడుదల చేశారన్నారు. ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సైతం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడు నెలల కాలపరిమితి పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ మోసం చేశారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని. జగన్ కాదు.. ఎవరు దిగివచ్చినా అమరావతిని మార్చడం సాధ్యపడే విషయం కాదని స్పష్టం చేశారు. ఒక నగరం అభివృద్ధి చెందే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని, దానిని సహించలేక కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు రగల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ హామీలు, రాజకీయ నాటకాలడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తును నిర్మించే కీలక నిర్ణయమని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి వేదికపైనా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఇకపై అభివృద్ధి నిరోధక రాజకీయాలకు ఏపీలో తావులేదని పునరుద్ఘాటించారు. Vasantha Krishna Prasad Interview, Mylavaram MLA Vasantha, YS Jagan Amaravati Comments, Jogi Ramesh Vasantha Krishna Prasad

Publish Date: Jul 29, 2026 5:19PM

political-news-img

2021నాటి అసెంబ్లీ ఘటనపై నారా భువనేశ్వరి భావోద్వేగం.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో శాసనసభలో తనపై వ్యక్తిగత విమర్శల చేసి, అవమానకరంగా వైపీపీ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ ఘటనను మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలు, స్థానిక కార్యకర్తల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు నారా భువనేశ్వరి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా.. ఓ స్థానిక ఆలయాన్ని దర్శించారు. ఆ ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తరువాత నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ, ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఏ పురుషుడికీ లేదన్నారు. 2021 నవంబరులో అసెంబ్లీ వేదికగా అప్పటి అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నేత చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు తన పేరును లేవనెత్తారన్న భువనేశ్వరి, తన భర్తపై రాజకీయంగా పై చేయి సాధించలేక.. తనను అనవసరంగా రాజకీయ రచ్చలోకి లాగారన్నారు. అసెంబ్లీ వంటి పవిత్రమైన సభలో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగిన సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి పరాభవం జరిగిన సమయంలో రాష్ట్ర ప్రజలే దేవుడి రూపంలో అండగా నిలబడ్డారని భువనేశ్వరి చెప్పారు. ప్రతి మహిళకు తన గౌరవాన్ని కాపాడుకునే శక్తి ఉంటుందని, ఎవరూ వచ్చి రక్షించాల్సిన అవసరం లేదన్నారు. తమకు నిరంతరం మద్దతుగా నిలిచిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. సాధారణంగా నారా భువనేశ్వరి వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు. అయితే ఆలయ సందర్శన వేళ ద్రౌపది విగ్రహాన్ని చూడటంతో భువనేశ్వరి నాడు అసెంబ్లీలో తనపై వైసీపీయులు చేసిన వ్యాఖ్యలను గుర్తుకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్షంగా ఏ పార్టీ పేరూ ప్రస్తావించకుండానే భువనేశ్వరి నాటి అధికార పక్ష తీరును తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా నాటి ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసేదే. ఐదేళ్ల క్రితం నాటి ఘటనను నారా భువనేశ్వరి మరల ప్రస్తావించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళల ఆత్మగౌరవం, అసెంబ్లీలో నైతిక విలువలపై ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. Nara Bhuvaneswari, Kuppam Tour, AP Assembly Incident, Chandrababu Naidu Wife, Andhra Pradesh Politics, TeloguOne

Publish Date: Jul 29, 2026 4:38PM

political-news-img

బోండా ఉమా కామెంట్స్‌పై రాజకీయ కాక.. కాపులకు క్లారిటీ ఉంది.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై వివాదం సృష్టించింది. గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో ముచ్చటించడం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓటింగ్ శైలి, పార్టీ అంతర్గత నిర్ణయాలపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు అమరావతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధిష్టానం దీనిపై వివరణ కోరడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలపై ప్రముఖ అనలిస్ట్ విక్రమ్ పూలా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం విఫ్ గా ఉంటూనే బోండా ఉమా ఒకటిరెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాలను గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా వ్యాఖ్యలకు, ఆయన వ్యవహార శైలికి పెద్ద ప్రాముఖ్యత నివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి వంటి సంక్షేమ, ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉన్న వేళ బోండా ఉమా వైఖరి పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. అయినంత మాత్రాన బోండా ఉమా వ్యవహారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాపులకు క్లారిటీ ఉందన్న విక్రమ్ పోలా.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన కాపు నాయకులు ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత అక్కడ ఎలాంటి ప్రాముఖ్యతా లేక, ఇమడ లేక తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా విషయానికి అనవసర ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరమన్నారు. Bonda Uma controversy, TDP Kapu politics, Ambati Rambabu Bonda Uma, AP political developments, Tone News Telugu news

Publish Date: Jul 29, 2026 4:18PM

political-news-img

రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా... అసలు కారణం ఇదే!

రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి వస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇన్సోమ్నియా (Insomnia) ఒకటి. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అనేక కారణాల వల్ల నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డా. సి. మంజులా రావు నిద్ర ఎందుకు పట్టదో, ఇన్సోమ్నియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో, నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో సులభంగా వివరించారు. అలాగే ఎలాంటి మందులు లేకుండానే మంచి నిద్ర కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు, పడుకునే ముందు చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, మానసిక ప్రశాంతతను పెంచే సూచనలు మరియు గాఢమైన నిద్ర కోసం ఉపయోగపడే సులభమైన చిట్కాలను కూడా ఈ వీడియోలో వివరించారు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్ర సమస్య ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Jul 29, 2026 4:07PM

political-news-img

తెలంగాణకు భారీ వర్ష సూచన.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్.!

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళ, బుధ (జులై 28, 29) తేదీలలో తెలంగాణలోన పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. రానున్న రెండు మూడు రోజులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమౌంది. ముఖ్యంగా పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజులలో కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గురు, శుక్రవారాల్లో (జులై 30, 31) సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల పట్టణాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. Telangana Rains, IMD Yellow Alert, Telangana Weather Forecast, Hyderabad Rains Update, Depression Rain Alert

Publish Date: Jul 29, 2026 3:42PM

MOVIE NEWS