Publish Date:Jul 29, 2025
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు. రష్యాలోని తూర్పు ప్రాంతమైన కమ్చట్కా ద్వీపం సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్ తీరప్రాంతాలతో పాటు పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అనేక దీవులకు సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భూకంపం ప్రభావంతో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికా హవాయి, అలస్కా, గువామ్ దీవులకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సైపాన్, రోటా, టినియన్ వంటి సమీప దీవులకు కూడా ముందస్తు అప్రమత్తం జారీ చేశారు. ఇలా ఉండగా జపాన్ ఉత్తర ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ ముప్పు అధికంగా ఉంటుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-russia-25-203057.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.