మత్య్సకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం

Publish Date:May 19, 2026

Advertisement

 

స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పిన ముఖ్యమంత్రి..

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు..

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం..

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో  ఓ మత్య్సకార కుటుంబం ఇంట్లో సీఎం చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. మార్కెట్‌లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి...స్థానిక మత్స్యకారుని ఇంటికి వెళ్లి వండించుకుని తిన్నారు. కుటుంబ సభ్యుడిలా వారితో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ముఖ్యమంత్రి మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించారు.

 

 

 కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్య్సకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నఅనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. అక్కడ ఉన్న మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు. మార్కెట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రికి మత్య్సకారుడు తానంగారి బాబు, ఆయన కుమారుడు గిరి స్వాగతం పలికారు. 

 

 

సీఎం తమ మార్కెట్‌కు రావడం పట్ల మత్స్యకారులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుడు తానంగారి బాబుతో మాట్లాడిన ముఖ్యమంత్రి... వారి జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్‌లో చేపల విక్రయాలపై అడిగి తెలుసుకున్నారు. ‘మత్య్సకారుల సేవలో’ పథకం ద్వారా ఏడాదికి అందుతోన్న రూ.20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని బాబు సీఎంకు వివరించారు. స్థానికంగా లభించే చేపల రకాల గురించి సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

 


 
మత్య్సకారుడి ఇంట...ముఖ్యమంత్రి భోజనం 

మార్కెట్‌లో సందర్శన అనంతరం స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం వారి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ లో కొనుగోలు చేసిన చేపలు తీసుకుని వెళ్లారు. తానంగారి బాబు సతీమణి వెంకమ్మ ముఖ్యమంత్రి తెచ్చిన చేపలను తమ ఇంట్లో వండారు. వెంకమ్మ చేపల పులుసు పెట్టే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడే ఉండి కూర వండే విధానాన్ని పరిశీలించారు. సరదాగా కొద్దిసేపు గరిటె తిప్పారు

 

ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన వెంకమ్మ కుమార్తెతో మాట్లాడి తల్లీబిడ్డ బాగోగుల గురించి ఆరా తీశారు. వెంకమ్మ చేపల కూర సిద్ధం చేయడంతో వారి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా తన చేతులతో వారికి చేపల పులుసును వడ్డించారు. అనంతరం వారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు. తమఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

By
en-us Political News

  
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి తమ ప్రతాపం చూపించారు.
ఇటీవల కాలంలో సమాజంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నాయి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక సాదాసీదా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిచెందిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఫోన్ చేశాడు. నిరంజన్ అనే తన కుమారుడు కర్నూలులోని జయరాజ్ స్టీల్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కాచిగూడ రైల్వే స్టేషన్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని, ఆ విషయం తెలియజేస్తూ.. తనకు వీడియో పంపాడని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.