లోకేష్ రెడ్ బుక్కా మజాకా
Publish Date:Aug 18, 2025
Advertisement
మనం చేసింది ఒకరు కాపీ కొడుతున్నారంటే అది సూపర్ హిట్ అయినట్టు లెక్క. ఇది తరచూగా కొందరు స్ట్రాటజిస్టులు చెప్పే మాట. లోకేష్ రెడ్ బుక్ విషయం కూడా సరిగ్గా ఇలాంటిదేనని చెప్పాలంటారు వీరు. మొన్న కవిత తాము పింక్ బుక్ రాస్తున్నామని కామెంట్ చేయడంతోనే ఈ రెడ్ బుక్ బొమ్మ హిట్ అయినట్టు చెప్పాలంటారు కొందరు టీడీపీ లీడర్లు. తాజాగా కేటీఆర్ సైతం ఈ తరహా కామెంట్లు చేశారు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారందరి.. పేర్లు ఊర్లు రాసిపెట్టాలని.. అధికారంలోకి వచ్చినంక.. అందరి పని చెబుతామని అంటున్నారాయన. దీనంతటిని బట్టీ చూస్తే ఆనాడు నెగిటివ్ గా కనిపించిన రెడ్ బుక్ ప్రస్తుతం పవర్ఫుల్ గా మారినట్టు తెలుస్తోందని అంటున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో కూడా దీని ప్రభావం పాకినట్టు, ఆయా నేతలకు సోకినట్టు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జగన్ కూడా ఒక యాప్ తెచ్చి అందులో అన్ని వివరాలను పొందు పరచమన్నారు. అయితే ఇది రెడ్ బుక్ కి- యాప్ వర్షన్ అన్న కామెంట్ వినిపించింది. రెబ్ బుక్ కి గుడ్ బుక్ తెస్తామని తొలినాళ్లలో బీరాలు పలికిన జగన్ ఆ తర్వాత అదే తరహాలో యాప్ తెస్తామని అన్నపుడే.. ఈ రెడ్ బుక్ ఎంత పెద్ద హిట్టో తెలుసుకోవచ్చంటున్నారు. బేసిగ్గా జగన్.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నీ తమ పథకాలే కాపీ కొడుతున్నట్టు ప్రచారం చేస్తుంటారు. ఆ మాటకొస్తే ఇక్కడ లోకేష్ అధికారంలోకి రావడానికే ఒక ఫార్ములా కనిపెడితే.. దాన్నిప్పుడు మీరంతా కలసి కాపీ కొట్టడాన్ని ఏమనాలి బులుగూస్! అన్న కౌంటర్ కామెంట్ వినిపిస్తోంది. స్టాన్ ఫర్డ్ లో చదివిన లోకేష్ కి ఈ కార్యకర్తలకు జీతాలు, డైరెక్ట్ క్యాష్ బెనిఫెట్ స్కీములు ఏమంత కొత్త కాదు. ఆయనకు ఇవన్నీ కొట్టిన పిండి. అయితే అవి బాబు దగ్గరకు వెళ్లేసరికల్లా.. రూపం మార్చుకుని కనిపిస్తాయి. ఒక్క రెడ్ బుక్ మాత్రమే ఒరిజినల్ గా అలా బయటకొచ్చేసి సూపర్ డూపర్ బంపర్ హిట్ కొడుతోంది. ఇటు ప్రత్యర్ధి పార్టీ వైసీపీయే కాకుండా.. ఎక్కడో ఉన్న బీఆర్ఎస్ సైతం అచ్చు దింపేస్తుందంటే అర్ధం చేసుకోవచ్చని కాలర్ ఎగరేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-204460.html





