తమ్ముళ్ల తలనొప్పి
Publish Date:Aug 18, 2025
Advertisement
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ్ముళ్ల తలనొప్పి మొదలైందా? సత్యవేడు ఎమ్మెల్యేతో మొదలు.. ప్రస్తుతం దగ్గుబాటి దుర్గాప్రసాద్, కూన రవికుమార్, నజీర్ ఇలా టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారంతో కొత్త తలనొప్పిగా తయారవుతోందా? మరి వైసీపీ వాగుడుకాయలైన వంశీ, నాని, అనిల్, రోజా వంటి వారికీ- వీరికీ తేడా ఏంటన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోందా? అన్న చర్చకు తెరలేచింది.ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల దందా మొదలైందన్న టాక్ ఒకింత వైల్డ్ గానే స్ప్రెడ్ అయ్యింది. అదే పెద్ద విషయమనుకుంటే మధ్యలో మరో తంటా వచ్చే ప్రమాదం ఉందికూన రవికుమార్ విషయమే తీస్కుంటే ఆముదాలవలస ఎమ్మెల్యే అయిన ఈయన తల్లికి వందనం విషయంలో ముగ్గురు ప్రిన్సిపాల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే పొందూరు కేజీబీవీ స్కూల్లో విద్యార్ధినుల నుంచి అక్రమంగా అదనపు డబ్బు వసూళ్లు చేస్తున్నారని తాను నిలదీయడం వల్లే వారిలా తనపై ఆరోపణలు చేస్తున్నారని అంటారు రవికుమార్. తాను అమెరికా నుంచి రాగానే వారి బండారం మొత్తం బయట పెడతానని అంటున్నారాయన. అయితే ఎమ్మెల్యే తనను వీడియో కాన్ఫరెన్స్ ల రూపంలో వేధిస్తున్నారంటూ.. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు.అయితే ఇందులో మరో కోణం కూడా లేకపోలేదని అంటారు. వచ్చే రోజుల్లో అచ్చెన్నను మంత్రిత్వం నుంచి తప్పించి కూనకు ఆ ప్రాంతం నుంచి పదవి ఇచ్చేలా అధిష్టానం ఆలోచిస్తుందని అంటారు.. దీంతో అచ్చెన్న వర్గమే ఇదంతా చేయిస్తుండవచ్చన్న ప్రచారం కూడా ఒకింత జోరుగానే నడుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ విషయం పార్టీకి తలనోప్పిగా మారింది . ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్.. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ముద్దులు పెడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వీడియో వ్యవహారం తేల్చాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ వీడియోలో ఉన్న టీడీపీ మహిళా నేత గుంటుపల్లి వాణి ఈ విషయంపై తాను మరో వీడియో రిలీజ్ చేశారు. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ చేసి ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారామె. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితురాలిగా భావించి మరో టీడీపీ మహిళా నేత సోఫియాను ప్రశ్నించారు పోలీసులు. ఆమె చెప్పేదాన్నిబట్టీ చూస్తే.. వాణికి ఎమ్మెల్యేకీ మధ్య ఎఫైర్ ఉన్న మాట వాస్తవమేనని బాంబు పేల్చారామె. ఇందులో ఇంకో నమ్మలేని నిజమేంటంటే ఈ వీడియో లీక్ చేసింది మరెవరో కాదు.. వాణి భర్త నవీన్ కృష్ణేనని అంటున్నారామె. ఈ విషయం తనకు స్వయంగా నవీన్ కృష్ణే చెప్పినట్టు పోలీసులతో చెప్పారామె. దీంతో ఎమ్మెల్యే వీడియో లీక్ కేసును ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధంకాని గజిబిజి గందరగోళం ఎదుర్కుంటున్నారట గుంటూరు పోలీసులు. ఇదంతా ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ దగ్గుబాటి ప్రసాద్ వ్యవహరం మరో తలనొప్పి తకరారు కింద తయారైనట్టు తెలుస్తోంది. అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా అనుమతులతోనే ఆడిస్తున్నారా? అని తెలుగు యువత నేత ధనుంజయ నాయుడితో చేసిన సంభాషణ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. తాను అనంతపూర్ ఎమ్మెల్యే కాబట్టి.. సినిమా ఆడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఆడియో లీక్‌లో వాయిస్ తనది కాదని కంప్లయింట్ చేశారు దగ్గుబాటి. తాను తొలి నుంచి నందమూరి, నారా కుటుంబాల అభిమానినని.. అలాగని జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెలాంటి ద్వేషం లేదని అన్నారాయన. ఒక వేళ తన మాటలకు జూనియర్ ఫ్యాన్స్ నొచ్చుకుని ఉంటే సారీ చెబుతున్నానని కూడా అన్నారు. ఈ ఆడియో లీక్ లోని వాయిస్ తనది కాదని ఆయన పోలీస్ కంప్లయింట్ కూడా చేశారు. ఇప్పుడీ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. జూనియర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు చేరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీనంతటికీ కారణమైన ఎమ్మెల్యే విషయం బాబు వరకూ చేరింది. వరుస పెట్టున తమ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా బుక్ అవడం. అది వైసీపీకి ఆయుధంగా మారడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఇవ్వాలసిందిగా పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పటికే కొలికిపూడి రూపంలో ఒక కొత్త తలనొప్పి తయారవుతుండటం గుర్తించి ఎలాగోలా కట్టడి చేశారు. ఆపై క్రమశిక్షణ కమిటీని వేసి ఇలాంటి వారందరిపైనా చర్యలు తీసుకునేలా ఒక ప్రణాళిక రచిస్తున్నారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలు బయట పడితే.. వారికి పార్టీలో గానీ పదవులు ఇవ్వడంలోగానీ ప్రాధాన్యత ఇవ్వబోమన్న సంకేతాలను పంపేలా తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-204458.html





