కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో హస్తినలో లోకేష్ బిజీబిజీ
Publish Date:Aug 18, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కేవలం భేటీలతో సరిపుచ్చడమే కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారికి పలు విజ్ణప్తులు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే... లోకేష్ వినతలు పట్ట కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. నారా లోకేష్ సోమవారం హస్తినలో కేంద్ర మంత్రులు జైశంకర్, జేపీనడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీలతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. అలాగే తమ బృందం సింగపూర్ పర్యటన వివరాలను ఆయనకు తెలిపారు. కాగా ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లోకేష్ కు హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని విజ్ణప్తి చేశారు. లోకేష్ వినతికి సానుకూలంగా స్పందించిన నడ్డా.. ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఇక కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన లోకేష్ రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేం దుకు సహకారం, అలాగే ఓఎన్ జీసీకి ఆఫ్ రిగ్ కాంట్రాక్టు సాధనకు తోడ్పడానికి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నితిన్ గడ్కరీతో భేటీలో కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అలా లోకేష్ కలిసిన ప్రతి కేంద్ర మంత్రీ లోకేష్ సమస్యలు వివరించిన తీరునూ, రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాల సాధన విషయంలో కనబరుస్తున్న శ్రద్ధనూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/lokesh-busy-in-delhi-39-204464.html





