పత్రాలు తగలెట్టేసి తప్పించుకుందామనే.. బెడిసి కొట్టిన సీఐడీ చీఫ్ బిగ్ ప్లాన్!

Publish Date:Apr 8, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తాడేప‌ల్లి సిట్ కార్యాల‌యం వ‌ద్ద సీఐడీ సిబ్బంది కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సిట్ కార్యాల‌యం కాంపౌండ్ లో పెద్ద‌ మొత్తంలో ప‌త్రాల‌ను ద‌గ్దం చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సీఐడీ చీఫ్ ర‌ఘురామ్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వాటిని ద‌గ్దం చేసిన‌ట్లు కార్యాల‌య సిబ్బంది తెలిపారు. సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాల్లో హెరిటేజ్ సంస్థకు చెందిన‌ కీల‌క ప‌త్రాలు. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.   ఈ ప‌త్రాల‌ను ద‌గ్దం చేసే స‌మ‌యంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొంద‌రిని వాటిని త‌మ‌కు ఇవ్వాల‌ని సీఐడీ అధికారులు ఒత్తిడి తేవ‌డం ప‌త్రాల ద‌గ్దం వెనుక పెద్ద మ‌త‌ల‌బే ఉంద‌న్నఅనుమానాలకు తావిచ్చింది. గ‌తంలో మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు అక్ర‌మ కేసులు నమోదు చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అధికారులు అనేక మందిపై ఒత్తిడి  తెచ్చారన్న  విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అంతేకాదు.. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ చట్టవిరుద్ధంగా అధికారులు పొందార‌ని అప్ప‌ట్లో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున  ప‌త్రాల‌ దగ్ధంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తాడేప‌ల్లి సీఐడీ కార్యాల‌యంలో కీల‌క పాత్రాలను  దగ్ధం చేసిన సంగతి వెలుగులోకి రావడంతో  ఉన్న‌తాధికారులు ఆఘ‌మేఘాల మీద‌ స్పందించారు. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అంటూ.. నమ్మించేందుకు  ప్ర‌య‌త్నించారు. తాము ఐదు కేసుల్లో చార్జిషీటు వేశామని, ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని,  చాలా జిరాక్సులు తీయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.. అయితే, జిరాక్సులు తీసే సమయంలో మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని, ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని, దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని తెలిపారు. తాజాగా సిట్ కార్యాల‌యం సిబ్బంది ద‌గ్దం చేసిన కాగితాలు కూడా అవేనంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అధికారుల వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు సీఐడీ ఉన్న‌తాధికారులు క‌ట్టుక‌థ‌లు చెబుతున్నరని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. సీఐడీ అధికారులు జిరాక్సులు తీసింది కేవ‌లం హెరిటేజ్ సంస్థ‌కు చెందిన కాగితాలేనా?  హెరిటేజ్ సంస్థ‌కు చెందిన ప‌త్రాల‌ను జిరాక్స్ తీసేట‌ప్పుడే మిష‌న్లో ఇంక్ అయిపోయిందా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్నితెలుగుదేశం నేత‌లు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు.  తెలుగుదేశం అధికారంలోకి వ‌స్తే   సేక‌రించిన ఆధారాలు త‌ప్పుడ‌వ‌ని తేలి ఎక్క‌డ జైలుకెళ్లాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యంతోనే సీఐడీ తాధికారులు కీల‌క ప‌త్రాల‌ను ద్వంసం చేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

సీఐడీ అధికారులు చంద్ర‌బాబుపై పెట్టిన కేసుల్లో కీల‌క ప‌త్రాల‌ను కూడా ద‌గ్దం చేశారని తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. పత్రాల దగ్ధంపై లోతైన విచారణకు డిమాండ్ చేశారు.   ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటమి ఖాయమని  స‌ర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  తెలుగుదేశం,  జ‌న‌సేన, బీజేపీ కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో కొంద‌రు పోలీసులు, అధికారులు వైసీపీ నేత‌ల‌కు తొత్తులుగా ప‌నిచేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పలువురిపై అక్ర‌మంగా కేసులు పెట్టి చిత్ర‌హింస‌లకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచనాలతో  వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు కొత్త ప్రభుత్వం వస్తే తమకు జైలు తప్పదన్న వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రాపకం కోసం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు, వేధింపులకు పాల్పడిన సిట్ అధికారులు ఇక సర్దుకునే పనిలో పడ్డారు.   గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్‌లు  ఇలా ఒక్కటేమిటి.. లెక్క లేనన్ని అక్రమాలతో నిలువెల్లా  బురద పూసుకున్న సిట్ ఇప్పుడు ఆ బురదను కడిగేసుకుని చేతులు దులిపేసుకోవడానికి నుడీ అయిపోయింది. అందులో భాగంగానే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలను ముఖ్యంగా తెలుగుదేశం  నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు. ఇది ఎలా బయటపడిందంటారా.. ఆ కార్యాలయంలోని వ్యక్తులే  దీనికి సంబంధించి వీడియో తీసి మీడియాకు పంపారు.  మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగల బెట్టామని వారు కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వుల పాలైంది.   అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా మిగిలిపోయిన పత్రాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి.  తెలుగుదేశం నేతలు సైతం సిట్ తప్పులు తగలెట్టేస్తే కనిపించకుండా పోయేవి కావని అంటున్నారు.  ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. 

అసలు ఈ ఐదేళ్ల కాలంలో సీఐడీ అధికారులు  తాము బాధ్య‌త క‌లిగిన అధికారుల‌మ‌న్న‌ విష‌యాన్ని పూర్తిగా విస్మరించి   జగ‌న్ ఏది చెబితే అది చేయ‌డ‌మే తమ ఉద్యోగ ధర్మం అన్నట్లుగా ఆయన సేవలో తరించిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్ర‌మంలో నే చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్టి జైలు పంపించ‌డం, లోకేశ్ ను విచారించ‌డం, తెలుగుదేశం ముఖ్య‌నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం వంటివి చేశారని తెలుగుదేశం గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నది.  వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న నిర్ధారణకు వచ్చేసిన సీఐడీ ఉన్న‌తాధికారులు.. చంద్ర‌బాబు కేసులో, లోకేశ్ ను విచారించిన స‌మ‌యంలో అక్ర‌మంగా సేక‌రించిన ఆధారాలు క‌నిపించ‌కుండా చేసే ఉద్దేశంతోనే కీల‌క ప‌త్రాల‌ను ద‌గ్దం చేశార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.     మొత్తానికి సిట్ కార్యాల‌యం ఆవ‌ర‌ణంలో ద‌గ్దం చేసిన ప‌త్రాల అంశంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.  

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.