బెంగాల్ లో ఈసీ వర్సెస్ టీఎంసీ.. ఒక సారి కాదు రోజూ తనిఖీ చేయండంటూ మమత సవాల్

Publish Date:Apr 16, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో కేవలం తమ పార్టీ నేతల వాహనాలను మాత్రమే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోల్‌కతాలోని డమ్‌డమ్ విమానాశ్రయం సమీపంలో తన వాహనాన్ని నిలిపి  సోదాలు చేసేందుకు అధికారులు సాహసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు అంత దమ్ముంటే, తన కారును కేవలం ఒకసారి కాదు..  రోజూ తనిఖీ చేయంని సవాల్ విసిరారు.  ఎన్నికల వేళ కేవలం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు,  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు. 

తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును కూడా అధికారులు తనిఖీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో టీఎంసీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత మండిపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని అధికారులకు ముఖం మీదే చెప్పానని ఆమె స్పష్టం చేశారు.

బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనూ కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీలపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల తీరును తప్పుబట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ తనిఖీల పర్వం మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.