హోర్ముజ్ జలసంధి ఓపెన్.. అయినా తొలగని యుద్ధ భయం

Publish Date:Apr 18, 2026

Advertisement

గడిచిన ఏడు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా పునఃప్రారంభించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ మార్గం తిరిగి తెరవడంతో గ్లోబల్ ఎకానమీకి భారీ ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.

అయితే, హోర్ముజ్ జలసంధి తెరుచుకున్నంత మాత్రాన సమస్య పూర్తిగా సర్దుమణిగిందని భావించలేము. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో  ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం జలసంధిని ఓపెన్ చేసినప్పటికీ.. ఇరాన్ లోని ప్రధాన ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం   ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే..  ప్రపంచానికి చమురు అందుబాటులోకి వచ్చేలా చేస్తూనే..  ఇరాన్ సొంత ఆర్థిక వ్యవస్థను మాత్రం అమెరికా తన అదుపులో ఉంచుకుంది. శాంతి చర్చలలో ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ దీనిని ఒక బలమైన 'లీవరేజ్'గా ఉపయోగిస్తోంది. శాంతి చర్చల తదుపరి ఘట్టం ఇప్పుడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరడం విశేషం. ఈ వారాంతంలోనే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండో రౌండ్ ప్రత్యక్ష చర్చలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది.  పాకిస్థాన్‌కు అటు అమెరికాతో రక్షణ సంబంధాలు, ఇటు ఇరాన్‌తో సున్నితమైన సరిహద్దు సంబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు. 

ఒకవేళ ఇక్కడ ఒప్పందం ఖరారైతే, స్వయంగా ట్రంప్ పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందన్న వార్తలు ఆ దేశ దౌత్య ప్రతిష్ఠను పెంచుతున్నాయి. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా, ఖతర్ మరియు టర్కీ వంటి దేశాలు కూడా ఈ సంక్షోభ నివారణకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే తెహ్రాన్‌లో పర్యటించి కీలక నేతలతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం మరియు భవిష్యత్తు భద్రతా ముసాయిదాను రూపొందించడంలో ఈ ప్రాంతీయ దేశాల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం చర్చల బల్లపై ఉన్న ప్రధాన అంశం 'డబ్బుకు ప్రతిగా అణు నియంత్రణ'. సుమారు మూడు పేజీల ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంట్‌పై ఇరు దేశాల ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. 

దీని ప్రకారం, అమెరికా ఆంక్షల వల్ల విదేశాల్లో స్తంభించిపోయిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను ఇరాన్ తిరిగి పొందుతుంది. దీనికి బదులుగా, ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి లేదా వేరే దేశానికి తరలించాలి. అణ్వాయుధ తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేయకుండా కఠినమైన అంతర్జాతీయ పర్యవేక్షణ ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.ఇరాన్ సైతం తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్న తెహ్రాన్, గౌరవప్రదమైన రీతిలో ఆంక్షల నుంచి విముక్తి కోరుకుంటోంది. గతంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన సైట్ల నుంచి 'న్యూక్లియర్ డస్ట్' ఇచ్చేందుకు సిద్ధమనడం ద్వారా, పర్యవేక్షణకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇరాన్ పంపింది. ఒక్క ముక్కలో  చెప్పాలంటే.. హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అనేది శాంతి దిశగా పడిన ఒక ముందడుగు మాత్రమే, అది అంతిమ పరిష్కారం కాదు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య చర్చల్లో వేగం పెరిగినప్పటికీ, ఆంక్షల తొలగింపు,  అణు వెరిఫికేషన్ మెకానిజంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చిన్న పొరపాటు లేదా మూడో పక్షం ప్రమేయం జరిగితే ఈ చర్చలు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. 

ఆ ప్రమాదం ఇప్పటికే ముంచుకొచ్చింది కూడా. ట్రంప్ నౌకాదళ దిగ్బంధనం ప్రకటన చేసిన తరువాత ఇరాన్ షార్ప్ గా రియాక్టైంది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ లో శాంతి చర్చల వ్యవహారం కూడా డోలాయమానంగా మారింది. 

- సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.