అలిపిరి నడక మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత

Publish Date:Aug 12, 2023

Advertisement

తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రత గాలిలో దీపంగా మారింది. తరచుగా ఆ మార్గంలో వన్యమృగాల సంచారాన్ని గుర్తించినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం టీటీడీ ఘోరంగా విఫలమౌతున్నది. ఇప్పటి వరకూ పలు సంఘటనల్లో వన్యమృగాల దాడిలో భక్తుల గాయపడిన సంఘటనలు చూశాం కానీ తాజాగా చిరుతపులి దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.  

అలిపిరినడక మార్గంలో వెళ్తుండగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడకదారిలో వెడుతున్న ఓ కుటుంబం బిడ్డను కోల్పోవడం అంత్యంత విషాదం
 
 నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అలిపిరి నడకమార్గం ద్వారా  కొండపైకి బయలుదేరింది. అర్థరాత్రికి కొంచం ముందు అంటే రాత్రి పదకొండు గంటల సమయానికి  ఆ కుటుంబం లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకుంది.   ఆ సమయంలోనే వారి ఆరేళ్ల పాప లక్షిత కనిపించకుండా పోయింది. కంగారుపడిన కుటుంబం ఆమె కోసం ఆ ప్రాంతం అంతా గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేఇశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత అడవిలో గాలింపు చేపట్టారు.  ఫారెస్టు సిబ్బంది సహకారంతో అడవిలో గాలింపు చేపట్టగా చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో ఆ చిన్నారి మరణించిందని నిర్ధారించారు. 

తిరుమల నడకదారిలో చిరుత దాడులు దాదాపుగా నిత్యకృత్యమయ్యాయి. ఈ ఏడాది జూన్ 23న కూడా ఇటువంి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన కుటుంబం నడకదారిలో శ్రీవారి కొండపైకి వెడుతుండగా ఏడో మైలు రాయి వద్ద చిరుత  దాడి చేసి వారి ఐదేళ్ల కుమారుడు కౌశిక్ ను నోట  కరచుకుని అడవిలోకి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత భయపడి కౌశిక్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన కౌశిక్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నాడు.  

ఈ సంఘటన తరువాత టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  అలాగే భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. అయితే అవేమీ పెద్దగా ఫలితమివ్వలేదని తాజా ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటికైనా అలిపిరి నడక మార్గంలో  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.