విపక్ష నేతల ప్రసంగాల స్క్రిప్టు కూడా పోలీసులే డిసైడ్ చేస్తారా?

Publish Date:Aug 12, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమైనా మాట్లా డొచ్చు.. ఎక్కడికైనాన వెళ్లొచ్చు. అదే విపక్ష నాయకుల దగ్గరకు వచ్చేసరికి  వారెక్కడ పర్యటించాలో , వారే దారిలో వెళ్లాలో ప్రభుత్వం లేదా పోలీసులు.. వాస్తవానికి ప్రభుత్వమే పోలీసు వ్యవస్థను శాసిస్తోంది. ప్రభుత్వం ఏం చెబితే పోలీసు వ్యవస్థ అదే చేస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక విపక్ష నేతలు ఏం మాట్లాడాలో కూడా  పోలీసులే చెప్పే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా గానీ, తాజాగా పవన్ కల్యాణ్ వారాహీయాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సంఘటనలు చూస్తే రానున్న రోజులలో అదే జరుగుతుందని అనిపించక మానదు.  పవన్ యాత్ర రోడ్డుకు ఎటు వైపు వెళ్లాలో.. ఆయన వెంట ఎంత మంది ప్రజలు ఉండాలో ఇత్యాది విషయాలన్నిటినీ పోలీసులే నిర్ణయించేశారు. ఇక సముద్ర తీర ప్రాంతమైన రిషి కొండలో జగన్ వినా మరెవ్వరూ ఉండటానికి వీల్లేదంటూ కండీషన్ పెట్టారు. ఈ మేరకు పవన్ కు నోటీసులూ జారీ చేశారు. ఆయన రోడ్డు కు ఎడమవైపు మాత్రమే పర్యటించాలనీ, కుడివైపునకు వెళ్లకూడదనీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఆయన విశాఖలో రోడ్ షో చేయడానికే వీళ్లేదనీ, నేరుగా సభావేదిక వద్దకు వెళ్లి ప్రసంగించి వెళ్లిపోవాలనీ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో విపక్షాల  మూవ్ మెంట్ ను నియంత్రించి.. నియంత్రించి అనేమిటి అసలు లేకుండా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక గళాలు ప్రజలకు చేరకుండా చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆంక్షల చట్రంలో బిగించేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన నిలుచున్న స్టూల్, ఆయన కోసం ఉన్న ప్రచార రథాలను సీజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలాగే  గతంలో చంద్రబాబు అనపర్తి, కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరునూ ప్రస్తావిస్తున్నారు. రానున్న రోజులలో విపక్ష నేతలు మాట్లాడాల్సిన ప్రసంగం స్క్రిప్టును కూడా పోలీసులో, సకల  శాఖల మంత్రో రాసి అదే చదవాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.