ఉండవల్లి శ్రీదేవి.. నాలుగు నెలల మౌనం వీడినట్లేనా?

Publish Date:Aug 12, 2023

Advertisement

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యక్షమయ్యారు. దాదాపు నాలుగు నెలల తర్వాత... అది కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ సందర్శిస్తున్న సమయంలో ఆయనతో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. అలాగే చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మాట్లాడిట్లు ఈ సందర్బంగా వెల్లడించారు. కానీ దాదాపు నాలుగు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండడంతో.. ఉండవల్లి శ్రీదేవి ఏమయ్యారన్న ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. 

ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క టీడీపీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. అయితే ఆమె అనూహ్యంగా గెలుపోందడంతో.. అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం... అదే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు... కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామ్‌నారాయణ రెడ్డి కాగా.. మరొకరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.  నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. సస్పెన్షన్ వేటు కొద్ది రోజులకు తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. అలాగే  సదరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో క్రియాశీలంగా రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

కానీ శ్రీదేవి మాత్రం తనపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే.. ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయిపోయారు. 

మరోవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోందని.. ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఎక్కడా కనిపించకుండా ఉన్నారనీ ఆమె నియోజకవర్గమైన తాడికొండలో ఓ సందేహమైతే వ్యక్తమవుతూ వస్తుంది. అలాంటి వేళ..  ఆగస్ట్ 10న ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ వద్ద ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి శ్రీదేవి దంపతులు రావడంతో.. ప్రజలకు ఓ క్లారిటీ అయితే వచ్చేసినట్లు అయింది.  చంద్రబాబుతో భేటీ అనంతరం.. పార్టీ మార్పుపై త్వరలో ఓ క్లారిటీ ఇస్తానని ఆమె స్వయంగా ప్రకటించడంతో.. సైకిల్ పార్టీలో చేరతారనే ఓ ప్రచారం అయితే తాడికొండ నియోజకవర్గంలో ఊపందుకొంది.

ఓ వేళ ఆమె పసుపు పార్టీలో చేరితే.. ఆమెకు మళ్లీ తాడికొండ సీటే ఇస్తారా? లేకుంటే రాష్ట్రంలో మరో నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపుతారా? అదీఇదీ కాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని.. పార్టీ అధికారంలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? అనే ఓ ప్రచారం సైతం పోటిలికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.