చైనా పట్టుతో రాష్ట్ర మల్బరీ సాగుకు ముప్పు
Publish Date:Mar 27, 2012
Advertisement
ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా చైనా వస్తువులే దర్శనమిస్తున్నాయి. బొమ్మలు, పెన్నులు, సెల్ ఫోన్ లు, కంప్యూటర్లు ఇలా ఒకటేమిటి నిత్యం మనకు రాష్ట్రంలో చైనా వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటివల్ల మన రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా చైనా పట్టు రాష్టంలో మల్బరీ సాగును దెబ్బతీస్తోంది. చైనా నుంచి అధికారికంగా కొంత, అనధికారికంగా పెద్దేత్తున చౌకగా వచ్చిపడుతున్న ఈ చైనా సిల్క్ వల్ల రాష్ట్రంలోని మల్బరీ సాగుచేస్తున్న రైతాంగం విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే మల్బరీ సాగు దాదాపు 30 శాతం తగ్గింది. దీనికితోడు పట్టుగూళ్ళ రెట్లు కూడా గణనీయంగా తగ్గాయి. గత నెలవరకూ కిలో రూ.250 నుంచి రూ.300 వరకు ఉన్న స్వదేశీరకం పట్టుగూళ్ళ ధర రూ.180 నుంచి రూ.220 వరకు పడిపోయింది. అలాగే విదేశీరకం గూళ్ళు ధర రూ.450 నుంచి రూ.350కి పడిపోయింది. రెట్ల పతనంతో మల్బరీ సాగుచేస్తున్న రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. సిల్క్ దిగుమతిపై కేంద్రం సుంకాన్ని 30 నుంచి 5 శాతానికి తగ్గించడంతో రాష్ట్ర మల్బరీ సాగు రైతాంగానికి ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో కొన్నిచోట్ల రైతులు విదేశీరకం గూళ్ళ ఉత్పత్తికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు
http://www.teluguone.com/news/content/china-silk-24-12944.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





