ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ మావోల బెడద
Publish Date:Mar 27, 2012
Advertisement
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వామపక్ష తీవ్రవాద మావోల నుంచి ముప్పు ఎదురవుతోంది. ఆంద్ర-ఛత్తీస్ ఘడ్, ఆంద్ర-మహారాష్ట్ర, ఆంద్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైయస్సార్ హయాంలో చావుదెబ్బ తిన్న మావోయిస్టులు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేశారు. తమ క్యాడర్ ను మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, బీహార్ లకు పంపివేశారు. క్రమంగా పోలీసులు కూడా రాష్ట్రంలో తమ పట్టును సడలించడంతో మావోయిస్టు క్యాడర్ అంతా ఇప్పుడు సరిహద్దుల్లో మాటువేసి దాడికి సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక ఎదురుదెబ్బలకు ఒక పెద్ద సంఘటన ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపులు జరుపుతున్నారు. మావోయిస్టులు ప్రజాప్రతినిధులపై దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని హెచ్చరిస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని ప్రజాప్రతినిధులకు పోలీసులు ఇప్పటికే సలహా ఇచ్చారు. ఏజెన్సీప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కొంతకాలం పాటు కుటుంబసభ్యులతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళడం మంచిదని కూడా పోలీసులు వారికి చెబుతున్నారు. అబూజ్ ఘడ్ లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణా ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. చాలాకాలం తరువాత రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్ళీ ప్రారంభం కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వణికిపోతున్నారు.
http://www.teluguone.com/news/content/maoists-problem-andhra-pradesh-24-12942.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





