డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. చిప్పిలి సమీపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన చంద్రబాబు.. డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్, కేసీఆర్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మీ మూలాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నాడన్నారు. నియంతలా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైసీపీకి చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. డేటా చోరీ పేరుతో తెలంగాణలో తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్ అంటూ తెలంగాణ సర్కార్‌ను హెచ్చరించారు. హైద్రాబాద్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ఘనత తనదని గుర్తుచేసిన చంద్రబాబు.. 'నీ ప్రభుత్వానికి డేటా కూడ లేదు. నా ప్రభుత్వానికి డేటా ఉంది' అని పరోక్షంగా కేసీఆర్ ని ఎద్దేవా చేశారు. మోడీ, కేసీఆర్, జగన్‌లు కుమ్మక్కై ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. అవసరమైతే నా ఓటును కూడ తొలగించేందుకు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. ఇది ఏపీ రాష్ట్రం.. బీహార్ రాష్ట్రం కాదన్నారు. మీ ఆటలు సాగనివ్వమన్నారు. అవసరమైత మీ తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-strong-warning-to-kcr-and-ys-jagan-39-86121.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.