ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయని.. వాటిని ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ నుంచే డేటా చోరీ అయినందున.. తెలంగాణ పోలీసులే కేసును దర్యాప్తు చేస్తారని స్పష్టంచేశారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశామని తెలిపారు.
ఈ విచారణలో కీలకమైన ఆధారాలను సేకరించినట్టు సజ్జనార్ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ నిర్వహిస్తోంది. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని సజ్జనార్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. ఆధార్, ఓటరు కార్డులు, కులాలు, ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారనే సమాచారాన్ని కూడ ఈ సంస్థ సేకరిస్తున్నట్టు గుర్తించినట్టుగా సజ్జనార్ చెప్పారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు విచారించాం. లబ్ధిదారుల డేటాను ఎలా సేకరించారు? వారి దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? దర్యాప్తులో తేలుతుంది అన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి 50 చోట్ల కేసులు నమోదయ్యాయని.. డేటా ఆధారంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారా అన్నది విచారించాలని ఆయన తెలిపారు.
సంక్షేమ పథకాల లబ్ది దారుల సమాచారం ప్రభుత్వం తప్ప ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండే అవకాశం లేదన్నారు. సున్నితమైన డేటాను ఎందుకు పబ్లిక్‌లో పెట్టారని సజ్జనార్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటా ఐటీ గ్రిడ్ సంస్థకు ప్రభుత్వం నుండి వచ్చిందా? లేక మూడో వ్యక్తి నుండి వచ్చిందా? అనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆధార్ అధికారులతో పాటు కేంద్ర ఎన్నికలసంఘానికీ, డేటాను హోస్ట్ చేసిన అమెజాన్ సంస్ధకూ ఫిర్యాదు చేశామన్నారు. అమెజాన్ వెబ్ సర్వర్ల నుంచి మరిన్ని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్‌ని ప్రధాన నిందితుడిగా గుర్తించామని.. తన వద్ద ఉన్న డేటాతో సరెండర్ కావాలన్నారు. ఆయన కోసం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గాలింపు సాగుతోందని, ఆయన పొరుగు రాష్ట్రంలో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.
అయితే దీనిపై టీడీపీ వాదన మాత్రం మరోలా ఉంది. సేవామిత్ర యాప్ టీడీపీ కార్యకర్తల యాప్. టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారంతా తమ అనుమతితో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కలర్ ఫోటోలు ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-grid-company-accessed-private-data-illegally-says-cyberabad-cp-39-86124.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.