తోతాపురి మామిడి రైతుకు చంద్రబాబు అండ! రైతుల ఆనందం!
Publish Date:Jul 7, 2025

Advertisement
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని మూడు జిల్లాలలో మామిడిరైతులు తోతాపురి రకం మామిడి పండించారు. ఈ రకం మామిడికి డిమాండ్ లేకపోవడంతో పంట అమ్ముడుపోయే పరిస్థితి లేక తీవ్రగా నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారుపాల్యం పర్యటనకు రానున్నారు. ఆయన యాత్ర ముఖ్య ఉద్దేశం మామిడియార్డ్ ను సందర్శించి, రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కోసం జగన్ బంగారుపాల్యం యాత్ర తలపోశారు. ఇందుకు ఇప్పటికే పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు మామిడి రైతులను అందుకోవడానికి పలు చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా. ఇప్పటికే చంద్రబాబు చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా ట్రేడర్లు నిలిచారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ముందుకు వచ్చాయి.
దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో 3 లక్షల 8 వేల 261 మెట్రిక్ టన్నల తోతాపురి మామిడి కొనుగోలు జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. అలాగే ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. ఇప్పటి వరకూ మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు ధృవీకరించారు. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు.
ఇక రైతులకు కేజీకి నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తోంది. ఇక ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో బంగారుపాల్యం పర్యటన ద్వారా జగన్ ఏ సాధిద్దా మనుకుం టున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-supports-totapuri-mango-farmes-39-201442.html












