ఢిల్లీలోనే డీల్..రాములమ్మ రూట్లో అజారుద్దీన్ ?
Publish Date:Aug 15, 2025
Advertisement
ఇటు నుంచి కాకపోతే, అటునుంచి నరుక్కురమ్మని అంటారు, పెద్దలు. మాజీ క్రికెటర్, ప్రస్తుత పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు, మహమ్మద్ అజారుద్దీన్, అక్షరాలా అదే చేస్తున్నారు. అవును, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే, తమ చిరకాల స్వప్నం నెరవేరాలంటే, జూబ్లీ’’ ఉప ఎన్నిక చక్కటి అవకాశంగా భావిస్తున్న,అజారుద్దీన్,ఈ అవకాశాన్నిఎట్టి పరిస్థితిలో వదులు కోరాదని భావిస్తున్నారు. అసలు ఈ ఉప ఎన్నిక వచ్చిందే తన కోసమని అజార్’ గట్టిగా నమ్ముతున్నట్లు చేపుతున్నారు. అందుకే, అయన కాంగ్రెస్ ‘టికెట్’ కోసం ఎందాకా అయినా వెళ్లేందుకు రెడీ’ అటున్నారు. నిజానికి,జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే’ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణ వార్త చెవిన పడగానే, అజారుద్దీన్’ నిముషం లేటు’ చేయకుండా, ఖాళీ కుర్చీలో కర్చీఫ్’ వేశారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిన, ఆయన ఈసారి టికెట్’ తనకే వస్తుందనే ధీమాను బహిరంగంగానే వ్యక్తపరిచారు. అదేదో సినిమాలో మహేష్ బాబు, తుపాకీ నాదే .. బులెట్’ నాదే’ అంటాడు చూడండి, అలాగే , అదే స్టైల్లో’ ‘టికెట్ నాదే, గెలుపు నాదే’ అని స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన ధీమా పై కోల్డ్ వాటర్’ కుమ్మరించారు.జూబ్లీ’అభ్యర్ధిని అధిష్టానం నిర్ణయిస్తుంది, అంతవరకూ ఎవరూ, స్వీయ’ప్రకటనలు చేయవద్దని సీరియస్’గా వార్నింగ్ ఇచ్చారు. మరో వంక, జూబ్లీ’లో గెలిస్తే మంత్రి పదవి’ ఖాయమనే ప్రచారం ఉపందుకోవడంతో జూబ్లీ టిక్కెట్’కు ‘డబుల్ ధమాకా’ స్థాయిలో గిరాకీ పెరిగింది. టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. దీంతో మొదట్లో అజారుద్దీన్’ వైపు మొగ్గుచూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అందుకు పోటీ ఎక్కువకావడం ఒక కారణం అయితే, ముస్లిం యేతరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, అప్పుడే కాంగ్రస్’కు తమ మద్దతు ఉంటుదని ఎంఐఎం షరతు విధించడం మరో కారణంగా చెపుతున్నారు.మరో వంక, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్’ స్థానికులకే జూబ్లీ టికెట్’ అని ప్రకటించి, అజార్ ఆశలపై మరో బకెట్ కూల్ వాటర్ కుమ్మరించారు. నిజానికి,ఉప ఎన్నికలో తానే అభ్యర్థినంటూ అజార్ ప్రకటించుకోవడంతో ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారని, వెంటనే తమ వ్యూహానికి పదును పెట్టినట్లు చెపుతున్నారు. అజార్‌కు’ చెక్ పెట్టేందుకు, క్రికెట్ అసోసియేషన్ రాజకీయాల్లోఅజార్’ పొడ అయినా గిట్ట్టని మంత్రి వివేక్’ రంగంలోకి దించి నట్లు చెపుతున్నారు.మంత్రి వివేక్ ఒకడుగు ముందుకేసి ఆ బాధ్యతను భుజాన వేసుకున్నట్టు పార్టీవర్గాలలో వినవస్తోంది.ఇక్కడే అజార్’ ఇటునుంచి కాకపోతే, అటు నుంచి నరుక్కు రమ్మన్న పెద్దలమాటను గుర్తుకు తెచ్చుకుని, ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ప్రారంభించారు. డైరెక్ట్’గా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్’ అగ్రనేతలు సోనియా గాంధీ. రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. జూబ్లీ టికెట్’ ఇవ్వాలని, అభ్యర్ధించి నట్లు సన్నిహితులు చెపుతున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. పీసీసీ నుంచి తన పేరును పంపినా పంపకున్నా, అధిష్టానం జాబితాలో మాత్రం చోటు చిక్కెలా’ ఏర్పాట్లు చేసుకునట్లు చెపుతున్నారు.అయితే, అధిష్టానం అప్పాయింట్మెంట్ ఇచ్చినంత తేలిగ్గా టికెట్ ఇస్తుందా, ముఖ్యంగా, లక్షా 20 వేల ముస్లిం ఒట్లున్న నియోజక వర్గంలో, ఒవైసీలను కాదని, కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్’ కు టికెట్’ ఇచ్చే సాహసం చేస్తుందా? అనేది ఇప్పడు పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు. అయితే,గతంలో, రాష్ట్ర నాయకులకు మాట మాత్రంగా అయినా చెప్పకుండానే, విజయశాంతి ఏ రూటులో అయితే ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారో, అదే రూట్’ లో తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, అజార్ విశ్వాసంతో ఉన్నట్లు చెపుతున్నారు. నిజమో కాదో కాన,, అజార్ అనుచరులు మాత్రం, అగ్రనేతలు ఇద్దరు గ్రీన్ సిగ్నల్’ ఇచ్చారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mohammad-azharuddin-39-204290.html





