టీడీపీ నేతలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్, వైసీపీ నేతలకు సిద్ధాంతాలు, విలువలు లేవని విమర్శించారు. మైలవరం నియోజకవర్గంలో పోలీసులకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు. అక్రమాల ద్వారా అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇప్పటి నుంచే డబ్బు సంచులు బయటకు తీస్తున్నారని, వైసీపీ వ్యవహారాలపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజల్లో బాగా క్లిక్ అయ్యాయని, జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్ ప్రకటించారని మండిపడ్డారు. డబ్బులు, అమలుకాని హామీలు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకిరావడం ఖాయమన్నారు. ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బందేం ఉండదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లాలని సూచించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీనే కాకుండా.. చెక్కులు బ్యాంకుల్లో వేస్తే డబ్బులు ఇప్పించే బాధ్యతనూ నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
అన్న వస్తున్నాడంటూ వైసీపీ చేస్తోన్న ప్రచారంపై కూడా టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని ఆయన విమర్శించారు. నేరస్థుడ ఎలా ఉండాలో తెలుసు కానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా? అని విమర్శించారు. ఈనెల 11వ తేదీన దిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి మద్దతు పలకాలన్నారు. 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుదామన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను మోదీ భష్టుపట్టిస్తున్నారని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-fires-ys-jagan-over-anna-vastunnadu-39-85742.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.