వ‌ర‌ద‌బాధితుల ప‌రామ‌ర్శ‌కు చంద్ర‌బాబు ప‌య‌నం

Publish Date:Jul 21, 2022

Advertisement

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక కే  ప్ర‌జాభిమానాన్ని పొంద‌డం కేవలం రాజకీయాలు చేయడంతోనే సాధ్యం కాదు. ప్ర‌జా నాయ‌కునిగా, ప్ర‌జ‌ల‌ ప‌క్షాన నిల‌వ‌గ‌లిగిన‌వారే నాయ‌కుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలుస్తారు. అందుకు అధికారంలోనే ఉండ‌న‌వ‌స‌రం లేదు,

విప‌క్ష నేత‌గా ఉన్నా ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించి ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు వెళ్లి వారి ప‌రిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి, స్వాంతన కలిగించడం నిజమైన ప్రజానాయకుడు చేయాల్సిన పని. ఆ పని చంద్రబాబు చేస్తున్నారు. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో   ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అనేక గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. జనం జీవ‌నాధారం కోల్పోయి దీనావ‌స్థ‌లో ఉన్నారు. వారికి ప్ర‌భుత్వం నుంచి సహాయం అందడం లేదన్న విమర్శలు  ఇప్ప‌టికే వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి హెలికాప్ట‌ర్‌లో తిరిగి ప‌రిస్థితుల‌ను పరిశీలించి వెళ్లిపోయారు అందుకే వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర విప‌క్ష తెలుగు దేశం నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌కు సహాయం అందించడంలో ఘోరంగా విఫలమైన తరుణంలో  టీడీపీ అధినేత వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారికి   ప్ర‌భుత్వం నుంచి కేంద్రం నుంచీ  కూడా స‌హా యం అందేలా ఒత్తిడి తీసుకువస్తానని చెబుతున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్రవారా ల్లో చంద్రబాబు పర్యటిస్తారు.  

కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆచంట, పి. గన్న వరం, రాజోలు, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బం దులను తెలుసుకుంటారు.  ఈ మేరకు గురువారం ఉద‌యం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్ర బాబు బయల్దేరారు.  ఆయోధ్య లంక, నాగుల్లంక, మానేపల్లి, అప్పనపల్లి, రాజోలు, దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, పొన్నపల్లి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.

 మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గతంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంట కుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరన్న చంద్రబాబు.. క్యాబి నెట్‌, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉన్న విపత్తు నిర్వ హణ వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.  

By
en-us Political News

  
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.