175 కాదు 13 స్థానాల్లో గెలిస్తే గొప్పే .. రఘురామ కృష్ణం రాజు

Publish Date:Jul 21, 2022

Advertisement

గతం మరిచిన జగన్ సీఎంగా తాను  సూపర్ మేన్ గా ఊహించుకుంటున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. అందుకే జనం ఆగ్రహ జ్వాలలను గమనించి కూడా వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలోనూ విజయం సాధిస్తామని చెబుతున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఫల్యాన్ని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఏం సాధించుకోగలమన్నది యోచించాలనీ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేసీ కోసం గత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేశారని వివరించారు.  గత ముఖ్యమంత్రి కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించిన జగన్ ఈ మూడేళ్లలో చేస్తున్నది ఏమిటని నిలదీశారు. వైసీపీ నేతలు వేసిన ఒకటీ ఆరా కేసులు కొట్టివేసిన తరువాత చంద్రబాబుపై అసలు కేసులే లేవన్న రఘురామ రాజు.. ఏ కేసులూ లేని చంద్రబాబే భయపడ్డారని విమర్శించిన జగన్ 32 ఆర్థిక నేరాల కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ భయంతో వణికిపోతుండటం వల్లే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం వద్ద నోరు విప్పడం లేదని జనం భావిస్తే తప్పేముందని ప్రశ్నించారు.  

పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారని, కానీ వైసీపీ  వారు అలా ఆందోళనలు చేసిన దాఖలాలే లేవన్నారు.  కేవలం ఒకే ఒక్కసారి సొంత పార్టీ ఎంపీ అయిన  తనపై అనర్హత వేయాలని కోరుతూ మాత్రమే ఆందోళన చేశారంని ఆంధ్రప్రదేశ్  జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో , అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు.

  నీటిపారుదల శాఖ మంత్రి వ్యక్తి , 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా   ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2024 జులై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి   చిత్తశుద్ధి లేదనడానికి ఇంత కంటే నిదర్శనమేముంటుందని రఘురామరాజు అన్నారు.  ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్లొద్దనీ రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు.. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అని జగన్ అంటున్నారని,   13 స్థానాలలో గెలిస్తే గొప్పేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి… బంగాళాఖాతంలో కలపండి… చెప్పులతో కొట్టండి అని జగన్ విపక్ష నేతగా చేసిన వ్యాఖ్యలకు అప్పటి  టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు 

By
en-us Political News

  
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.